E-Paper
Advertisement

Road Accident: వరినాట్ల కోసం వస్తుండగా ప్రమాదం.. స్పాట్‌లో 18 మంది కూలీలు

Road Accident: వరినాట్ల కోసం వస్తుండగా ప్రమాదం.. స్పాట్‌లో 18 మంది కూలీలు
Advertisement

Road Accident: పెద్దపల్లి జిల్లా పరిధిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 18 మంది కూలీలకు తీవ్ర గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన కూలీలు సుల్తానాబాద్‌లో వరినాట్ల పనుల కోసం వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  ఈ ఘటన సమయంలో బొలెరోలో ఎక్కువ మంది కూలీలు ఉన్నారు.

Advertisement

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాన్ని రోడ్డుపక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రాథమికంగా డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం స్పష్టమైన కారణాలు వెల్లడిస్తామని తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాహనం అనుమతికి మించి కూలీలను తీసుకెళ్లిందా, భద్రతా నిబంధనలు పాటించారా లేదా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

Advertisement

Also Read: అమెరికాలో భారీ పేలుడు.. 3 బిల్డింగ్ లు తుక్కుతుక్కు

ప్రస్తుతం గాయపడిన కూలీలకు వైద్య చికిత్స కొనసాగుతోంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×