E-Paper
Advertisement

Himalaya Mountain COLLAPSE: హిమాలయాల్లో టైమ్‌బాంబ్.. డేంజర్‌లో భారత్!

Himalaya Mountain COLLAPSE: హిమాలయాల్లో టైమ్‌బాంబ్.. డేంజర్‌లో భారత్!

Himalaya Mountain COLLAPSE: ప్రపంచంలోనే అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటి.. హిమాలయ పర్వతాలు. కానీ ఇప్పుడీ మంచు కొండల కింద ఓ టైమ్‌బాంబ్‌ ఉందని తెలుసా? అది కూడా పేలడానికి సిద్ధంగా ఉందని తెలుసా?. యస్.. పైకి ప్రశాంతంగా చల్లగా ఉండే ఈ హిమాలయ పర్వతాల కింద.. ఓ తీవ్రమైన యుద్ధం జరుగుతోంది. ఖండాలను చీల్చే టెక్టానిక్ ప్లేట్ల మధ్య రాపిడి.. ఇప్పుడు టెన్షన్‌ పెంచుతోంది. అదే ఇప్పుడు గ్రేట్ హిమాలయన్ ఎర్త్‌క్వేక్‌కు దారి తీయబోతుందనే విషయం ఇప్పుడు కలవరపెడుతోంది. ఇంతకీ ఏంటీ గ్రేట్ హిమాలయన్ ఎర్త్‌క్వేక్..? ఇది నిజంగా మనం టెన్షన్ పడాల్సిన విషయమేనా?

కొత్త ప్రమాదాలను సృష్టించబోతున్న మంచుకోట
ప్రశాంతంగా.. నిర్మలంగా కనిపించే హిమాలయాలు.. ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మారాయంటున్నారు సైంటిస్టులు. రీసెంట్‌గా జపాన్‌లో 7.6 తీవ్రతతో జపాన్‌ను వణికించింది కదా. ఇప్పుడీ భూకంపం తర్వాత అందరి చూపు హిమాలయాలపై పడింది. మన దేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాలు మన దేశానికి ఓ పెట్టని కోట. కానీ ఇప్పుడిదే మంచు కోట కొత్త ప్రమాదాను సృష్టించబోతుందుని చెబుతున్నారు సైంటిస్టులు. హిమాలయాల కింద ఓ టైమ్‌ బాంబ్‌ ఉందని.. అది ఎప్పుడు పేలినా.. భారీగా జన, ఆస్తి నష్టం తప్పదని అంటున్నారు.

హిమాలయాల కింద ఇండియన్, యురేషియన్ టెక్టానిక్ ప్లేట్స్
హిమాలయాల కిందే ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, యురేషియన్ టెక్టానిక్ ప్టేట్ ఉంటుంది. ఇక్కడ ఈ రెండు ప్లేట్స్ నిరంతరం ఢీకొడుతూ ఉంటాయి. నిజానికి ఈ ప్లేట్లు వేల సంవత్సరాలుగా ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూ తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ఇది ఎప్పుడో ఒకప్పుడు బయటికి రాక తప్పదని చెబుతున్నారు సైంటిస్టులు. ఆ ఒత్తిడి భూకంపం రూపంలోనే ఉంటుందని.. అదే జరిగితే రిక్టర్‌ స్కేలుపై 8 లేదా అంతకంటే ఎక్కువ పరిణామంతో భూమి కంపిస్తుందని చెబుతున్నారు. అదే జరిగితే దీని ఎఫెక్ట్‌ మొత్తం ఉత్తర భారతదేశంతో సహా.. నేపాల్‌లో కూడా భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పవని చెబుతున్నారు.

హిమాలయ ప్రాంతమంతా జోన్-6
ఇటీవల జరిగిన దేశ భూకంప రిస్కు జోన్ల మ్యాపింగ్‌ మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.భూకంప జోన్‌ రూపురేఖలను బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ తాజాగా సవరించింది. అత్యధిక రిస్క్‌తో కూడిన జోన్‌ 6 ను కొత్తగా ఏర్పాటు చేసి.. హిమాలయ ప్రాంతమంతటినీ దాని పరిధిలోనే చేర్చింది. ఈ నిర్ణయం తర్వాత మంచు కొండల్లో ఓ పెనుముప్పు ముంచుకొస్తుందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది.

ఇథియోపియాలో బద్దలైన హేలీ గుబ్బి అగ్ని పర్వతం..
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్ని కూడా కాస్త టెన్షన్‌ పెడుతున్నాయనే చెప్పాలి. ఇటీవల ఇథియోపియా అపార్ రీజియన్‌లో హేలీ గుబ్బి అగ్ని పర్వతం బద్దలైంది. 500 మీటర్ల ఎత్తులో ఉన్న హేలీ గుబ్బి అగ్నిపర్వతం.. 12 వేల సంవత్సరాల తర్వాత పేలింది. ఎక్కడో అఫ్రికా దేశమైన ఇథియోపియా నుంచి అగ్నిపర్వతం తాలూకూ బూడిద మేఘం.. భారత్ మీదుగా ప్రయాణం చేస్తూ చైనా వరకు వెళ్లింది.

భారీ సునామీలకు కేరాఫ్‌గా జపాన్
ఇప్పటికే పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ యాక్టివ్‌గా మారింది. మన భూమిపై ఎక్కువగా భూకంపాలు సంభవించే ప్రాంతం ‘రింగ్ ఆఫ్ ఫైర్. పసిఫిక్ మహా సముద్రం చుట్టూ ఉండే ఈ విశాలమైన రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం చిలీ, పెరు, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్ , తైవాన్, ఇండోనేషియా, పాలినేషియా ప్రాంతాల్లో విస్తరించి ఉంది. అయితే దీనికి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం జపాన్ అనే చెప్పాలి. గతంలో భారీ సునామీలకు ఈ ప్రాంతం కేరాఫ్‌గా ఉండేది.

జపాన్ ప్రజలకు నిత్యగండంగా భూకంపాలు..
జపాన్‌లో రెండు రోజుల వ్యవధిలో 7.6, 6.7 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. నిజం చెప్పాలంటే జపాన్ ప్రజలకు భూకంపం అనేది ఓ నిత్యగండం. ఎప్పుడు ప్రకంపనలు వస్తాయో తెలియదు.. ప్రశాంతంగా ఉన్న సముద్ర మహోగ్రంగా మారుతుందో తెలియదు. అందుకే తక్కువ ప్రాణ నష్టం జరగకుండా ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారు. జపాన్ జనం ప్రకంపనలకు అలవాటు పడిపోయారు. ప్రస్తుతం జపాన్‌ను మెగాక్వేక్‌ టెన్షన్ పెడుతోంది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 8 దాటితే దానిని మెగాక్వేక్ అని పిలుస్తారు. మెగా క్వేక్ వస్తే నష్టం ఏ స్థాయిలో ఉంటుందనే విషయంపై జపాన్‌ ప్రభుత్వం ఇటీవల అంచనాలు వేసింది. ఒకవేళ సముద్ర తీరంలో చీలిక సంభవిస్తే మాత్రం దాదాపు 2లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందనేది అధికారుల అంచనా.

జమ్ము కాశ్మీర్ నుంచి అరుణాచల్ వరకు అత్యధిక ప్రమాదం జోన్
సరిగ్గా ఇలాంటి అంచనాలే ఇప్పుడు హిమాలయాల విషయంలో కూడా వెలువడుతున్నాయి. లెటెస్ట్‌గా బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ రిలీజ్ చేసిన మ్యాప్‌లో హిమాలయన్‌ ఫ్రంటల్‌ థ్రస్ట్‌ వెంట దక్షిణ దిశగా విస్తరించే భూకంప అవకాశాలను పరిగణనలోకి తీసుకున్నారు. దీనివల్ల డెహ్రాడూన్‌ లాంటి ప్రాంతాలతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు భూకంప ప్రమాదం పెరిగింది. మొదటిసారిగా మొత్తం హిమాలయ శ్రేణి అంటే జమ్ము కాశ్మీర్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు అత్యధిక ప్రమాద జోన్‌లో చేరింది.

నిజానికి టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సంఘర్షణల వల్ల భవిష్యత్తులో మధ్య హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించే అవకాశముందనేది చాలా రోజులుగా వినిపిస్తున్న మాటే. భూగర్భ డేటా, భారతీయ భూ వైజ్ఞానిక పరిశోధన సంస్థ, గూగుల్‌ ఎర్త్‌తో పాటు ఇస్రో కార్టోసాట్-1 శాటిలైట్‌ తీసిన చిత్రాల ఆధారంగా ఈ ప్రాంతంలో 8.5 తీవ్రతతో భూకంపం వస్తుందని అంచనా వేశారు. బెంగళూరులోని జవహర్‌ లాల్‌ నెహ్రూ శాస్త్రీయ పరిశోధన సంస్థ గతంలోనే ఈ పరిశోధన వివరాలను ప్రచురించింది. ఉత్తరాఖండ్ నుంచి పశ్చిమ నేపాల్ మధ్య… భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ విపత్తు సంభవించే అవకాశముందని తేల్చారు.

ఈ మంచుకొండల్లో కంపనాలు కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు సైంటిస్టులు ఇస్తున్న వార్నింగ్‌లు మాత్రం అంత లైట్‌గా తీసుకునేట్టు కనిపించడం లేదు. నిజంగానే సైంటిస్టులు హెచ్చరిస్తున్నట్టు జరిగితే జరగబోయే పరిణామాలేంటి? మనం ఆ ముప్పును ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నామా? ఈ టైమ్‌బాంబ్‌ పేలేందుకు ఎగ్జాక్ట్‌గా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది?

1934లో 8 తీవ్రతతో భూకంపం..
హిమాలయాలకు భూకంపాలు, అందులోనూ భారీ ప్రకంపాలు నిజానికి కొత్తేమీ కాదు. 1934లో ఏకంగా 8 తీవ్రతతో సంభవించిన భూకంపం బిహార్‌ మీదుగా నేపాల్‌ దాకా ఓ బీభత్సం సృష్టించింది. ఇక లెటెస్ట్‌గా చూసుకున్నా 2015లో నేపాల్‌లోని హిమాలియన్ రీజియన్‌లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం అక్కడ భారీ జన, ఆస్తి నష్టాలకు కారణమైంది. ప్రస్తుతం హిమాలయ ప్రాంతంలో 54 ఎర్త్‌క్వేక్ అబ్జర్వేటరీలు కూడా ఎప్పటికప్పుడు హిమాలయన్ రీజియన్‌లో భూకంపాలను పర్యవేక్షిస్తున్నాయి.

1255లో రికార్డు స్థాయిలో భూకంపం
ఈ రీజియన్‌లో రికార్డు స్థాయిలో భూకంపం 1255లో వచ్చింది. అప్పుడు వచ్చిన భూకంపంలో నేపాల్‌ రాజ్యం మూడింట ఒక వంతు నశించినట్లు తెలుస్తోంది. అలాగే జూన్ 1505లో ఒక భూకంపం దక్షిణ టిబెట్‌లో విధ్వంసం సృష్టించింది. అదే ఏడాది జులై నెలలో మరో భూకంపం ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌ను అతలాకుతలం చేసింది. 1555లో భారత్‌లోని శ్రీనగర్‌లో వచ్చిన భూకంపం వందలాది మందిని బలి తీసుకుంది. ఇది ఈ రీజియన్‌లో వచ్చిన భూకంపాలకు సంబంధించిన మొదటి చారిత్రక రికార్డు.

ఒక్కసారి చరిత్రలోకి వెళితే.. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఖండాలు ఇప్పటిలా ఉండేవి కాదు. అన్నీ కలిసి దగ్గర దగ్గరగా ఉండేవి. దానినే పాంజియా అని పిలిచేవారు. ఈ ఖండాలు క్రమంగా ఒక దానికొకటి దూరంగా జరుగుతూ.. సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం రెండు మహా ఖండాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ మహా ఖండాలే… గోండ్వా‌నా లాండ్, లారేసియాగా ఏర్పడ్డాయి. అయితే ఇప్పటి భారత భూభాగం ఒకప్పుడు గోండ్వానా లాండ్‌లో ఓ చిన్న భూ పలకంలా ఉండేది. అది లక్షల సంవత్సరాల పాటు అలా నెమ్మదిగా జరుగుతూ… ఇప్పటి ఆసియాలో మరో భూ ఫలకాన్ని గట్టిగా ఢీ కొట్టడంతో హిమాలయాలు ఏర్పడ్డాయి. ఆ స్థానంలో గతంలో తెథిస్ సముద్రం ఉండేదని చరిత్ర చెబుతోంది.

అయితే ఈ భూఫలకాల మధ్య ఘర్షణ ఇప్పటికీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఆ ఘర్షణ పుణ్యమే ఈ భూకంపాలు. సాధారణ భూకంపాలతో పోలిస్తే.. హిమాలయాల్లో ఏర్పడే భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఏమేర ప్రిపేర్ అయ్యి ఉన్నామనేది ఇప్పుడు ముఖ్యమైన విషయం. ఈ విషయంలో జపాన్‌ తర్వాతే ఏ దేశమైన అని చెప్పాలి. ఎందుకంటే భూకంపాలకు భయపడి బతకడం కంటే.. వాటి నుంచి తప్పించుకోడానికి ఏం చేయాలనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు అక్కడి ప్రజలు. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఎర్త్ క్వేక్స్ పై పాఠాలు చెబుతున్నారు. డ్రిల్స్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నట్టుండి అలారమ్స్‌ మోగించి వెంటనే విద్యార్థులందరూ బెంచ్‌ల కింద దాక్కోవాలని చెబుతుంటారు. ఇదో రెగ్యులర్ ప్రాక్టీస్ అక్కడ.

ముందుగా పసిగట్టేలా భవనాల్లో అలెర్ట్ సిస్టమ్
జపాన్‌లో ఇళ్ల నిర్మాణాలు కూడా కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. బిల్డింగ్స్‌లో సెస్మిక్ ఇసోలేషన్ బేరింగ్స్‌ను వాడుతారు. భవనాలు కూలిపోకుండా ఇవి అడ్డుకుంటాయి. భూకంపాన్ని ముందుగా పసిగట్టేలా భవనాల్లో అలెర్ట్ చేసే సిస్టమ్ ఉంటుంది. భూమి కంపించినప్పుడు ఆటోమెటిక్‌గా గ్యాస్, ఎలక్ట్రిసిటీ సప్లై నిలిచిపోతుంది. అన్ని బిల్డింగ్స్‌ని పదేళ్లకోసారి చెక్ చేస్తుంటారు. అటు తీరంలో భూకంపం వచ్చి సునామీలు వచ్చినా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జపాన్ అణువిద్యుత్ కేంద్రాల దగ్గర ప్రత్యేక రక్షణ చర్యలు ఉంటాయి.

Also Read: ఇండిగోకు జీఎస్టీ బిగ్ షాక్ .. రూ.59కోట్ల భారీ జరిమానా

మరి మన దగ్గర పరిస్థితి ఏంటి? అంటే సమాధానం లేదు. మన దగ్గర ఈ స్థాయి ప్రికాషన్స్‌ లేవనే చెప్పాలి. అయితే హిమాలయాల్లో భూకంపం వచ్చేస్తుందని ఆందోళన అక్కర్లేదంటున్నారు మరికొందరు నిపుణులు. టెక్టానిక్ ప్లేట్స్ మధ్య ఒత్తిడి నిజమే కానీ.. ఆ ఒత్తిడి ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. 2.5 నుంచి 3.5 తీవ్రతతో కూడిన కంపనాలు ఎప్పటికప్పుడు వస్తున్నాయని.. సో.. ఎక్కువ టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు అనేది మరికొందరు నిపుణుల మాట. ఎవరెన్ని చెప్పినా.. అతి సమీప కాలంలోనే హిమాలయాల్లో భారీ భూకంపం రావడం మాత్రం తప్పదనేది ఎక్కువగా వినిపిస్తున్న మాట. మరి ఈ టైమ్‌ బాంబ్‌ ఎప్పుడు పేలుతుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Story By Vamshi Krishna, Bigtv

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×