E-Paper
Advertisement

Chittoor Crime: వీడు అసలు తండ్రేనా.. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి.. కన్న కూతురిపై..

Chittoor Crime: వీడు అసలు తండ్రేనా.. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి.. కన్న కూతురిపై..
Advertisement

Chittoor Crime: కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కాలయముడిలా మారుతుంటే.. ఆ కంటికి కన్నీరు కూడా ఇంకిపోతోంది. రక్షణ కల్పించాల్సిన నీడయే నిప్పులా మారి ప్రాణాలను దహిస్తుంటే.. ఆడపిల్ల ఇంకా ఎక్కడ సురక్షితం. భరోసా ఇవ్వాల్సిన చేతులే బలి తీసుకుంటున్నాయి. అల్లారు ముద్దుగా పెంచాల్సిన కన్న తండ్రే పేగు బంధాన్ని మరిచిపోయి కామంతో కళ్లు మూసుకుపోయి తన కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడటం సభ్యసమాజం నిజంగా తలదించుకోవాల్సిన విషయం. అలాంటి సంఘటనే ఇప్పుడు చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో చోటుచేసుకుంది. కన్న కూతురిపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కసాయి తండ్రి.

పెద్దపంజాణి గ్రామానికి చెందిన పెద్దబ్బకు ఇద్దరు భార్యాలు ఉన్నారు. అతని మెుదటి భార్యకు చెందిన బాలికను చెట్ల పొదల ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఇది గమనించిన బాలిక నానమ్మ వెంటనే అడ్డుకునేందుకు ప్రయత్నించగా..  నిందితుడు ఆమెపై దాడి చేయడంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. పరిస్థితి తీవ్రంగా మారడంతో బాలిక నానమ్మ గ్రామంలోకి వెళ్లి స్థానికులను సహాయం కోసం తీసుకురావడానికి ప్రయత్నించింది.

Advertisement

అయితే..  బాలిక నానమ్మ తిరిగి వచ్చేలోపే బాలికపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు కీచల తండ్రి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బాధిత బాలికకు అండగా నిలిచారు. అనంతరం ఈ ఘటనపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పెద్దపంజాణి పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. బాలిక వయస్సు మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు వేగవంత చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అవసరమైన చికిత్స అందించారు. బాలిక కుటుంబ సంభ్యులు, గ్రామస్తులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై  యంత్రాంగం కూడా స్పందించి.. బాధిత బాలికకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసా ఇచ్చారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సంఘటన మహిళలు, చిన్నారుల భద్రతపై మరోసారి చర్చకు దారి తీసింది.

Advertisement

ALSO READ: Teacher Attacks minor girl: నాలుగేళ్ల చిన్నారిని చితకబాదిన టీచర్.. స్కూల్ వద్ద ఉద్రిక్తత.

 

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×