BigTV English

Rave Party: బర్త్ డే పేరుతో రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో 51 మంది, డ్రగ్స్ స్వాధీనం

Rave Party: బర్త్ డే పేరుతో రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో 51 మంది, డ్రగ్స్ స్వాధీనం

Rave Party: మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో బర్త్‌డే పేరుతో జరిగిన రేవ్ పార్టీ సంచలనంగా మారింది. ఉగాండాకు చెందిన మమస్ అనే వ్యక్తి నిర్వహించిన ఈ వేడుకపై పోలీసులు దాడి చేసి, మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 51 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగింది? ఎవరెవరు పాల్గొన్నారు? పోలీసులు ఎలా దాడి చేశారు? దర్యాప్తు ఎటువైపు దారి తీస్తోంది? అన్ని వివరాలు తెలుసుకుందాం.


Also Read: Bhagya Sri Borse: ఆలోచనలో పడ్డ భాగ్యశ్రీ.. ఏమైంది బేబీ!

మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీతో రేవ్ పార్టీని వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి నిర్వాహకుడిగా ఉగాండాకు చెందిన మమస్. అయితే ఫామ్ హౌస్ వద్ద కార్లు ఆగి ఉన్నాయి. పార్టీ చేసుకునే వ్యక్తులుగా కనిపించలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి అక్కడి వెళ్ళి చూడగా బిత్తరపోయారు. అది బర్త్ డే పార్టీ కాదు రేవ్ పార్టీగా గుర్తించారు.. పార్టీపై పోలీసులు దాడి చేయగా ఒక్కసారిగా షాక్ తిన్నారు. అక్కడ రేవ్ పార్టీలో యువత డ్రగ్స్‌తో తూగుదూ కనిపించింది. అలా 10 కాదు 20 కాదు ఏకంగా 51 మంది ఉన్నారు. దీంతో పోలీసులు 51 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు.


Also Read: Food culture: ఆ రాష్ట్రంలో మటన్, చికెన్ తెగ తినేశారు.. ఒక్క రోజులో అన్ని కోట్ల వ్యాపారమా!

సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు జరిపారు. ఈ దాడుల్లో 65 బీర్ సీసాలు, 20 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైన వారిలో చాలామంది ఆఫ్రికన్ దేశాల పౌరులు కావడం విశేషం. మొత్తం 51 మందిలో 14 మంది పురుషులు, 37 మంది మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ వినియోగం అనుమానంతో అక్కడ ఉన్న వారందరికీ పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక పరీక్షల్లో కొంతమందికి పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ పార్టీలో ఉగాండా, నైజీరియా దేశాల పౌరులు కూడా పాల్గొన్నారని తెలిపారు. డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ లిక్కర్ పార్టీ, డ్రగ్స్ వినియోగం కేసులో మేము పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నాం. ఫామ్‌హౌస్ యజమానిపై కేసు నమోదు చేస్తాం. అదుపులో ఉన్న వారి వీసా స్టేటస్ గురించి ఇమ్మిగ్రేషన్ అధికారుల ద్వారా తెలుసుకుంటున్నాం. ఇమ్మిగ్రేషన్ తనిఖీలు పూర్తయిన తరువాత మిగతా డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

 

Related News

Bihar gang: హైదరాబాద్‌లో బీహార్ గ్యాంగ్ అలర్ట్.. చర్లపల్లిలో మూడు పిస్టల్స్ స్వాధీనం!

Srikakulam Crime: వాట్సాప్‌లో అమ్మాయి పేరుతో చాటింగ్.. తర్వాత నిద్ర మాత్రలు ఇచ్చి.. ప్రియుడిని పిలిచి.. భర్త హత్య

Jadcherla Incident: లారీని ఢీ కొన్న బస్సు .. స్పాట్‌లో కూకట్‌పల్లి వాసులు

Hyderabad News: హైదరాబాద్‌లో పాక్ యువకుడి రాసలీలలు.. భార్యకి చిక్కాడు, అసలు స్కెచ్ అదేనా?

Visakha RK Beach: బీచ్‌లో విషాదం.. గల్లంతైన ముగ్గురు వ్యక్తులు, ఒక్కరు మృతి

Big Stories

×