Mrunal Thakur: మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటున్నారు. అయితే తాజాగా మృణాల్ ఠాగూర్ సోషల్ మీడియా వేదికగా మరొక హీరోయిన్ ఇంకొక క్షమాపణలు చెబుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అసలు ఈమె క్షమాపణలు చెప్పడం ఏంటి అసలేం జరిగిందనే విషయానికి వస్తే.. గత కొద్దిరోజుల క్రితం మృణాల్ ఠాకూర్ కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది ఈ వీడియోలో భాగంగా ఈమె మరొక నటి బిపాషా బసు(Bipasha Basu) గురించి బాడీ షేమింగ్ (Body Shaming)కామెంట్స్ చేశారు.
నా మాటలు బాధపెట్టాయి..
19 సంవత్సరాల వయసులో ఒక టీవీ ఇంటర్వ్యూలో భాగంగా బిపాషా బసు గురించి మాట్లాడుతూ చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ ప్రస్తుతం వివాదానికి కారణం అయ్యాయి. దీంతో ఈమె పై చాలా మంది విమర్శలు కురిపిస్తున్న నేపథ్యంలో ఈ వీడియో పట్ల మృణాళ్ ఠాకూర్ స్పందిస్తూ నటి బిపాషా బసుకు క్షమాపణలు తెలియజేశారు.”19 సంవత్సరాల వయసులో నేను ఎన్నో సిల్లి విషయాల గురించి మాట్లాడాను అయితే ఆ మాటలు ఇతరులను బాధపెట్టాయని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను చేసిన ఆ మాటలు కావాలని ఎవరిని కించపరచాలని కాదని, అనుకోకుండా తప్పు జరిగిపోయిందని” తెలిపారు.
హద్దులు దాటిన మాటలు…
“ఒక ఇంటర్వ్యూలో భాగంగా సరదాగా మాట్లాడిన ఆ మాటలు హద్దులు దాటి వెళ్లిపోయాయి. ఆ మాటలను తాను మరొక విధంగా కూడా మాట్లాడి ఉండవచ్చు. కాలంతో పాటు తాను కూడా ఎదిగానని అందం అనేది అన్ని రూపాలలో వస్తుంది ఇప్పుడు ఆ విషయాన్ని నేను గ్రహిస్తున్నాను నేను చేసిన వ్యాఖ్యల పట్ల మనస్పూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను” అంటూ ఎక్కడ కూడా బిపాషా బసు పేరు ప్రస్తావనకు తీసుకురాకుండా ఈమె క్షమాపణలను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం పలు హిందీ సినిమాలతో పాటు తెలుగు సినిమా పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈమె నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ధనుష్ ప్రేమలో మృణాల్…
ఇక ప్రస్తుతం ఈమె అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ (Dacoit)సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా ఈ ఏడాది క్రిస్మస్ పండుగను పరిష్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో మృణాల్ ఠాకూర్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Danush) తో కలిసి ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీరిద్దరూ ఇటీవల ఓ పార్టీలో చాలా సన్నిహితంగా ఉండటం కలిసి సినిమాలకు వెళ్లడం వంటి చర్యలు చూస్తుంటే ఈ వార్తలు నిజమేనని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయాలపై మృణాల్ ఠాకూర్ ఎక్కడ స్పందిస్తూ ఈ వార్తలను ఖండించకపోవడం గమనార్హం . మరి వీరి డేటింగ్ రూమర్ల గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Also Read : Vishwak Sen: మళ్ళీ పేరు మార్చుకున్న నటుడు విశ్వక్ సేన్… సక్సెస్ కోసమేనా?