Sangareddy News: పటాన్‌చెరులోని కిలాడీ లేడీ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఈమె గురించి మీడియాలో వార్తలు వస్తున్నా పోలీసులు అరెస్టు చేయడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? మోసం చేసిన జాబితా లిస్టు 50 మందికి పైగానే ఉన్నారా? నాలుగు రోజులు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదని బాధితులు ఎందుకంటున్నారు? అసలేం జరుగుతోంది.
కిలాడీ విద్య ఎక్కడ?
తాను చేపట్టిన స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే రెట్టింపు డబ్బు వస్తుందని నమ్మించింది. నిజమేనని నమ్మిన చాలామంది మహిళలు భారీగా పెట్టుబడి పెట్టారు. పెట్టుబడుల రూపంలో దాదాపు 18 కోట్లు డబ్బులు తీసుకుని ముఖం చాటేసింది. డబ్బు ఇవ్వాలని అడిగిన పాపానికి బాధితులపై దాడి చేయించింది ఈ కిలేడీ. ఈ వ్యవహారంపై నాలుగు రోజులుగా మీడియాలో ఒకటే వార్తలు.
ఈ కేసు వ్యవహారం ఓ అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి వెళ్తోంది. ఈనెల 10న కేసు నమోదు చేశారు పోలీసులు. రెండురోజులుగా గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. సోమవారం సంగారెడ్డి ఎస్పీని కలిసేందుకు సిద్ధమవుతున్నవారు విద్య బాధితులు. ఈ కేసు ఎంతవరకు వచ్చిందని పోలీసులను అడిగితే విచారణ చేస్తున్నామని, ఆమె కోసం రెండు టీమ్‌లు గాలిస్తున్నాయని చెబుతున్నారు.
సిటీలో ఉన్నట్లు అంచనా
మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే చెప్పాలని బాధితులను అడుగుతున్నారట సీఐ వినాయక రెడ్డి. ఎన్నో కేసులను వేగంగా పరిష్కరించిన పోలీసులు టెక్నాలజీ వినియోగం అధికంగా పెరిగినప్పటికీ ఆ ప్రాంతంలో విద్యను, రాజశేఖర్ ను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని అంటున్నారు బాధితులు. పోలీసులు తమను ఏం చేయలేరని బాధితులకు ఫోన్ చేసి విద్య చెప్పిన మాటలు నిజమనేలా ఉందని అంటున్నారు.
తమపై దాడి చేసినవారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని సీఐ వినాయకరెడ్డిపై బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్య డబ్బులు రాజశేఖర్ వద్ద ఉన్నట్లు బాధితులు చెబుతున్నమాట.ఇంత జరుగుతున్నా పరారీలోవున్న విద్యకు ఎవరు షెల్టర్ ఇస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ALSO READ: పని ఇస్తామని నమ్మించి, మహిళపై అత్యాచారం
బీరంగూడలో ఉన్న అనూషరావుకు విద్య సన్నితురాలని చెప్పినా పోలీసులు సైలెంట్‌గా ఉండటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు విద్య కేసును పెండింగ్‌లో పెట్టి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రీవెన్స్ డే నాడు సోమవారం ఆ జిల్లా ఎస్పీని కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడానికి సిద్ధమవుతున్నారు బాధితులు.
మరోవైపు విద్య వీడియోలో రివాల్వర్ చేతితో పట్టుకుని ఫోజులివ్వడంపై చర్చ జరుగుతోంది. ఇంతకీ విద్యకు ఆ గన్ ఎక్కడిది? ఎవరిచ్చారు? ఏమైనా గ్యాంగులు మెయింటైన్ చేస్తోందా? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. అన్నట్లు బిల్డర్లు, సినిమా ప్రొడ్యూసర్లతోపాటు తిరుపతికి సంబంధించి 50 మంది ఉన్నట్లు సమాచారం. విద్య కేసు ఏమోగానీ పోలీసుల వ్యవహారశైలిపై బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.