Warangal Crime: ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంజనీరింగ్ చదివించాలని తపన పడుతుంటారు. ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి కాలేజీలను ఎంపిక చేసుకుంటారు. మంచి కాలేజీ వస్తే క్యాంపస్ ఇంటర్వ్యూలు వస్తాయని, ఆ తర్వాత లైఫ్‌లో పిల్లలు హాయిగా సెటిలైపోవచ్చని భావిస్తుంటారు. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
బీటెక్ స్టూడెంట్స్ ఆత్మహత్య
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామానికి 19 ఏళ్ల కీర్తన ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. గోపాల్‌పూర్ ప్రాంతానికి చెందిన కృష్ణాకర్‌కు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. అయితే చిన్న కూతురు కీర్తన హైదరాబాద్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.
అధ్యాపకులు చెప్పిన పాఠాలు యువతికి సరిగా అర్థంకాలేదు. దీనివల్ల చాలా రోజులు ఇబ్బందిపడేది. ఈ విషయం ఇంట్లోవాళ్లకు కొన్నాళ్లు చెప్పలేక ఇబ్బందిపడేది. హైదరాబాద్‌లో చదివే ఛాన్స్ ఎవరికీ రాదని భావించింది. మనసులోని మాట ఎవరికీ చెప్పకుండా సైలెంట్ అయ్యింది. పేరెంట్స్ దూరంగా ఉండడంతో మనసులో బాధపడేది.
కాలేజీలో ఏం జరిగింది?
చివరకు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చింది. వెంటనే కీర్తనను ఇంటికి రప్పించారు తల్లిదండ్రులు. వేరే కళాశాలలో చేర్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో ఏమైందోగానీ ఈనెల 10న శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేరు. ఆ సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆ తర్వాత తండ్రి కృష్ణాకర్ ఇంటికి వచ్చి తలుపు తీసి షాకయ్యాడు.
ALSO READ: కాపురంలో చిచ్చు.. ప్రియుడితో భార్య, భర్త ఏం చేశాడంటే
వెంటనే గ్రామంలోని ఆర్‌ఎంపీని పిలిపించి పరీక్షించారు. అప్పటికే కీర్తన ఈ లోకాన్ని విడిచిపెట్టేసింది. కూతురు ఆత్మహత్య చేసుకున్న ఆవేదన ఆమె తండ్రిని అనుక్షణం వెంటాడుతోంది. చివరకు శనివారం కృపాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.