Road Accident: అనకాపల్లి జిల్లా లంకెలపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కంటైనర్ లారీ అదుపుతప్పి ఒక కారు, ఒక జీపు, నాలుగు బైకులను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు అనకాపల్లి పట్టణానికి చెందిన కొణతాల అచ్చినాయుడు , అనకాపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన పచ్చికూర గాంధీగా గుర్తించారు. మరొక మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడినవారిని వెంటనే అగనంపూడిలోని ఎన్టీఆర్ హాస్పిటల్‌కు తరలించారు, అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వేగంగా వస్తున్న కంటైనర్ అదుపుతప్పి సిగ్నల్ వద్ద ఆగివున్న వాహనాలను వెనుక నుంచి ఢీకొట్టిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రమాదం దాటికి కారు నుజ్జయ్యింది.
Also Read: గద్వాలలో మరో సోనమ్.. పెళ్లి తర్వాత లవర్‌కి 2,000 సార్లు ఫోన్.. తేజేశ్వర్ కేసులో కొత్త కోణాలు
మరోవైపు చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం.. యనమాలగుంట సమీపంలో.. ఆటోను ఓవర్టేక్ చేయబోయిన ద్విచక్ర వాహనదారుడు. ఎదురుగా వస్తున్న లారీ ని ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. భాదితులు ముస్లింపాలెం గ్రామానికి చెందినవారుగా తెలిపారు పోలీసులు.