BigTV English

Greater Noida: భార్యని సజీవ దహనం చేసిన భర్త.. తల్లిదండ్రులతో కలిసి ఘాతుకం, ఎక్కడ?

Greater Noida: భార్యని సజీవ దహనం చేసిన భర్త.. తల్లిదండ్రులతో కలిసి ఘాతుకం, ఎక్కడ?

Greater Noida: వివాహాలు జరక్క పెళ్లికాని ప్రసాదులు ముదిరిపోతున్నారు. మరికొందరైతే కాపురం చేయలేక.. భార్యని చంపేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాను చెప్పిన పని చేయనందుకు భార్యని తగులబెట్టేశాడు భర్త. ఆ భర్తకు తల్లిదండ్రులు తోడయ్యారు. సంచలనం రేపిన ఈ ఘటన గ్రేటర్ నొయిడాలో వెలుగుచూసింది అసలేం జరిగింది?


యూపీలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో భర్త, అత్తమామలు నిప్పంటించి కోడలికి సజీవ దహనం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆమె భర్త విపిన్‌ను అరెస్టు చేశారు పోలీసులు.మహిళ భర్త, అత్త-మామలు, బావమరిది సహా నలుగురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

యూపీలో గ్రేటర్ నొయిడాలో నిక్కీ-విపిన్ భాటీ వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అల్లుడికి ఇవ్వాల్సిన కానులను ఇచ్చారు అమ్మాయి తల్లిదండ్రులు. స్కార్పియో కారు, బుల్లెట్ , భారీ ఎత్తున నగదు ఇచ్చాడు. అల్లుడు ఫ్యామిలీ కాస్త ఉన్నత కుటుంబానికి చెందినవారు కావడంతో వారి గౌరవానికి ఏ మాత్రం తీసిపోని విధంగా లాంఛనాలు పెట్టారు.


వివాహం జరిగిన కొన్నాళ్లు తర్వాత భార్యభర్తల మధ్య కలతలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం కోడల్ని భర్త, అత్తమామలు నిరంతరం వేధించేవారు. అదనంగా రూ. 35 లక్షలు తీసుకురావాలని డిమాండ్ చేశారట భర్త తల్లిదండ్రులు. ఈ క్రమంలో అల్లుడికి మరో కారు ఇచ్చారు. అయినా వేధింపులు ఏ మాత్రం తగ్గలేదు.

ALSOR READ: గర్భవతి భార్యని చంపిన భర్త.. శరీరాన్ని ముక్కలు చేసి మూసీలో

చివరకు ఆగస్టు 21న సిర్సా గ్రామంలో ఇంట్లో భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. భర్త-అత్తమామ కలిసి కోడలిపై మండే ద్రవాన్ని పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన నిక్కీని నోయిడాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర కాలిపోవడంతో అక్కడి నుంచి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

నిక్కీ ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే ఆమె తల్లిదండ్రులు, బంధువులు వెంటనే అల్లుడి ఇంటికి వచ్చారు. శవాన్ని చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అల్లుడు, తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు పోలీసులు. మృతురాలి భర్త విపిన్ భాటి, అతడి తల్లిదండ్రుల దయ-సత్యవీర్‌, బావ రోహిత్‌లు నిందితులుగా పేర్కొన్నారు. వెంటనే పోలీసులు నిక్కీ భర్త విపిన్‌ను అరెస్టు చేశారు.

నిక్కీ సోదరి కాంచన వెర్షన్ ఏంటి? చెల్లికి పెళ్లి తర్వాత రూ. 35 లక్షలు డిమాండ్ చేశారని పేర్కొంది. మరో కారు కొని ఇచ్చామని కానీ వేధింపులు కంటిన్యూ అయ్యాయని ప్రస్తావించింది. తాను సంఘటనా స్థలంలో ఉన్నానని, తన సోదరిని కాపాడలేకపోయానని కన్నీరుమున్నీరు అయ్యింది కాంచన్.

నిక్కీ-కాంచన్ అక్కాచెల్లెళ్లు. వీరిద్దర్ని 2016లో ఆ కుటుంబంలో ఇద్దరు యువకులు వివాహం చేసుకున్నారు.  చెల్లికి జరిగిన దారుణాలను బయటపెట్టింది. నిక్కీ భర్త విపిన్ మరో మహిళతో సంబంధం ఉందని ఆరోపించింది కాంచన్. ఈ వ్యవహారం నిక్కీ-విపిన్ మధ్య నిత్యం గొడవలకు కారణమని చెబుతోంది. రాత్రి వేళ గైర్హాజరు కావడాన్ని నిక్కీ తన భర్తను ప్రశ్నించేది.

ఈ విషయం లేవనెత్తినప్పుడు నిక్కీని దారుణంగా టార్చర్ చేయడం, ఆపై కొట్టడం జరిగేదని వివరించింది. ఫిబ్రవరి 11న నిక్కీ తన కార్యాలయంలో దాడికి గురైందని విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. దీనిపై పంచాయతీలో పెద్దలు సర్దిచెప్పినప్పటికీ, ఇంటికి వచ్చినప్పుడు మళ్లీ టార్చర్ చేసేవారని వివరించింది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి వీడియో వెలుగులోకి వచ్చింది.

Related News

Electric Shock: దారుణం.. హైదరాబాద్‌లో కరెంట్ షాక్‌తో మరో వ్యక్తి దుర్మరణం..

Medchal News: గర్భవతి భార్యని చంపిన భర్త.. శరీరాన్ని ముక్కలు చేసి మూసీలో, మేడ్చల్‌ జిల్లా దారుణం

Cyber fraud: 2 నెలల్లో 500 కోట్లు.. ఇదేం మోసం.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు!

Sahasra Murder Case: మా బిడ్డను హత్య చేసినట్టే వాడిని చంపేయాలి.. పీఎస్ ముందు కుటుంబ సభ్యుల నిరసన

Sahasra Murder: సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు.. క్రికెట్ బ్యాట్ కోసమే ఇదంతా..?

Big Stories

×