Electric Shock: ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో కరెంట్ షాక్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం రోజుల క్రితమే జన్మాష్టమి వేడుకల్లో శోభయాత్రలో రామంతాపూర్‌లో విద్యుత్ షాక్ ఘటనలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే.. దీని తర్వాత రెండు రోజులకే వినాయకుడిని తీసుకెళుతుండగా.. కరెంట్ షాక్ తగిలి మరో ఇద్దరు మరణించారు. అయితే ఇది మరువక ముందే రో ఘటన చోటు చేసుకుంది.
కరెంట్ షాక్‌తో మరో వ్యక్తి దుర్మరణం
హైదరాబాద్‌లో కరెంట్ షాక్‌తో మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మేడ్చల్ తిరుమలగిరి ప్రాంతంలో విద్యుత్ వైర్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతానికి చెందిన లక్కీ అనే యువకుడు బొల్లారం రిసాల బజార్‌లోని ఓ టెంట్ హౌస్‌లో కూలీగా పని చేస్తున్నాడు. ఓ శుభకార్యానికి వేసిన టెంట్ తొలగిస్తుండగా విద్యుత్ వైర్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి.
ఒకరు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..
అయితే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిలో మున్నా, విజయ్, సంతోష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?
6 రోజుల వ్యవధిలో 10 మంది మృతి
ఇక హైదరాబాద్‌లో 6 రోజుల వ్యవధిలో కరెంట్ షాక్‌లతో 10 మంది మృతి చెందారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఘటనలపై తెలంగాణ ప్రభుత్వం కరెంట్ షాక్ ఘటనలపై సీరియస్‌గా చర్యలు తీసుకుంటుంది.
SHOCKING VIDEO
హైదరాబాద్‌లో కరెంట్ షాక్‌తో మరో దారుణం
మేడ్చల్ జిల్లా లోతుకుంటలో ఓ ఇంట్లో శుభకార్యం నిమిత్తం పందిరి వేస్తుండగా కరెంట్ వైర్ ఐరన్ రాడ్‌కు తగిలి విద్యుత్ షాక్
ఈ ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు pic.twitter.com/zpl8DoMn1x
— BIG TV Breaking News (@bigtvtelugu) August 24, 2025