Brahmamudi serial today Episode: పెళ్లి ఆగిపోయిందన్న బాధతో యామిని రూంలోకి వెళ్లి లాక్ చేసుకుంటుంది. అది చూసిన వైదేహి ఏడుస్తూ రాజ్‌ను తిడుతుంది. నీ వల్లే నా బిడ్డ ఇవాళ సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందని ఏడుస్తుంది. దీంతో రాజ్ ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇద్దరం బాధపడేకంటే పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ అని అలా చేశాను అని రాజ్ చెప్తాడు. అయితే ఇప్పుడు ఆ మాట చెప్పి నువ్వేం సాధించాలనుకున్నావు అంటూ వైదేహి తిడుతుంటే యామిని డోర్ ఓపెన్ చేసుకుని వస్తుంది.
ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు. చావడానికి వెళ్లిన నీ కూతురు తిరిగి వచ్చి ప్రాణాలతో ఎలా నిలబడిందని చూస్తున్నావా..? బావ నాతో పెళ్లి ఇష్టం లేదని చెప్పగానే.. ఆ క్షణం చనిపోవాలనే అనిపించింది. కానీ అదే క్షణంలో బావ వైపు నుంచి కూడా ఆలోచించాను. బంధువుల అందరి ముందు పెళ్లికి ఒప్పుకుని చివరి క్షణంలో వద్దని ఎందుకు చెప్పాడా అని అప్పుడే నాకు అర్థం అయింది. నా బలవంతం మీద నాకు ఏమౌతుందోనని ఒప్పుకున్నాడు. బావ మనసులో ఇంకెవరో ఉన్నారు అందుకే నాకు తాళి కట్టలేదు. ఏం బావ నిజమేనా..? నా కోసం ఇష్టాన్ని చంపుకుని నా మీద జాలితో ఈ పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు అంతేగా బావ. నాకు కావాల్సింది నీ జాలి కాదు బావ నీ ప్రేమ. అయినా నీ మనసులో ఇంకొకరు ఉండగా నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నావు బావ మనఃస్పూర్తిగా చెప్తున్నాను బావ నువ్వు ఎవరినైతే ప్రేమించావో వారినే నువ్వు పెళ్లి చేసుకో బావ. అని చెప్పగానే.. రాజ్ షాకింగ్ గా చూస్తూ.. నిజంగా నా మీద నీకు కోపంగా లేదా… యామిని అని అడుగుతాడు.
దీంతో యామిని నవ్వుతూ ఫస్ట్ కోపం వచ్చింది బావ. కానీ నువ్వంటే నాకు ఎంతిష్టం అంటే ఆ కోపాన్ని కూడా మర్చిపోయేంత అని చెప్తుంది. దీంతో రాజ్ సారీ యామిని అంత మంది ముందు ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పి నిన్ను చాలా బాధ పెట్టాను ఒకరకంగా అవమానించాను అంటాడు. దీంతో యామిని బావ ఇంక ఆ విషయం వదిలేయ్.. జరగాల్సిన దాని గురించి వదిలేయ్ అసలు అడగడమే మర్చిపోయాను నీ మనసులో ఉన్న ఆ లక్కీ గర్ల్ ఎవరు..? నేను తెలుసుకోకూడదా..? బావ అంటుంది. దీంతో రాజ్ కళావతి అని చెప్తాడు. దీంతో యామిని నవ్వుతూ కళావతియా..? చాలా మంచి అమ్మాయి. నీకు మంచి జోడీ బావ. నేను కాకపోతే నీ లైఫ్‌లోకి ఎవరు వస్తారోనని భయపడ్డాను. గుడ్ డిసీజన్ బావ. అవును నీ మనసులో మాట తనకు తెలుసా..? అని అడగ్గానే ఇన్‌డైరెక్టుగా తెలుసు అని రాజ్ చెప్తాడు. దీంతో యామిని ఇన్‌డైరెక్టుగా ఏంటి బావ ఇప్పుడే వెళ్లి కళావతికి నీ ప్రేమ సంగతి చెప్పు అనగానే సరే అంటూ రాజ్ వెళ్లిపోతాడు. రాజ్ వెళ్లగానే యామిని మమ్మీ ఆకలేస్తుంది ఏదైనా టిఫిన్ చేయవా అని అడుగుతుంది.
దీంతో వైదేహి షాకింగ్‌గా నువ్వు నిజంగా బాగానే ఉన్నావా…? అని అడుగుతుంది. దీంతో యామిని నాకేంటి మమ్మీ బాగానే ఉన్నాను కదా అంటుంది. రాజ్ చేసిన పనికి నువ్వు ఏమైపోతావోనని ఎంత భయపడ్డామో తెలుసా..? కానీ నువ్వు అంటూ ఏదో చెప్పబోతుంటే బావతో కళావతిని పెల్లి చేసుకోమని చెప్తానని ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా అంటుంది యామిని. దీంతో వైదేహి అదే నాకు అర్థం కావడం లేదు బేబీ రాజ్ లేకపోతే నాకు జీవితమే లేదని చెప్పిన దానివి సడెన్గా ఎలా మారిపోయావు అంటుంది. దీంతో యామిని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మమ్మీ.. రాజ్ లేకుండా నాకు జీవితమే లేదు. నేను లైఫ్‌లాంగ్ రాజ్‌తోనే కలిసి బతుకుతాను. ఏంటి నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నారా..? అని అడుగుతుంది. దీంతో అనుకోవడం కాదు నీకు నిజంగా పిచ్చి పట్టింది అనిపిస్తుంది అని వాళ్ల డాడీ తిడతాడు. దీంతో యామిని తాను రూంలో ఉండగా రుద్రాణి ఫోన్ చేసి తనను కన్వీన్స్ చేసిన విషయం చెప్తుంది. అందుకే తాను రివర్స్ లో డ్రామా మొదలు పెట్టానని చెప్తుంది యామిని.
తర్వాత రాహుల్ స్వప్న దగ్గరకు వెళ్లి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు నీకు అన్ని చెప్పాల్సిన అవసరం లేదని స్వప్న తిడుతుంది. తర్వాత యామిని, కావ్యకు ఫోన్ చేసి రాజ్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు అని చెప్తుంది. దీంతో నేను అదే చెప్తున్నాను మా ఆయన మీద ఎక్కువ ఆశలు నువ్వు పెట్టుకోకు అంటూ వార్నింగ్ ఇస్తుంది. అయితే యామిని మాత్రం అంత ఈజీగా మా బావను నేను ఎలా వదిలేసుకుంటాను అనుకుంటావు.. బావ ఇంకొకరి సొంతం అంటే చచ్చినా ఒప్పుకోను అంటుంది యామిని. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?