BigTV English

CM Chandrababu: టాప్‌లో సీఎం చంద్రబాబు.. చివరలో మమతాబెనర్జీ, ఈ ర్యాంకుల గోలేంటి?

CM Chandrababu: టాప్‌లో సీఎం చంద్రబాబు.. చివరలో మమతాబెనర్జీ, ఈ ర్యాంకుల గోలేంటి?

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.931 కోట్లకు పైగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీఎం పెమా ఖండు రూ.332 కోట్ల ఆస్తులతో రెండవ స్థానంలో ఉన్నారు. 31 మంది ముఖ్యమంత్రులలో ఈ ఇద్దరు బిలియనీర్లుగా ఉన్నారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ 15 లక్షల రూపాయలతో చివరి స్థానంతో సరిపెట్టుకున్నారు.


దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులు ఇటీవల ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌-ADR తాజా నివేదిక ఆయా విషయాలను వెల్లడించింది. దేశంలోని 30 మంది సీఎంల సగటు ఆస్తులు రూ.54.42 కోట్లు కాగా, ఆస్తుల మొత్తం రూ.1,632 కోట్లుగా పేర్కొంది. ఇద్దరు బిలియనీర్లు ముఖ్యమంత్రులు.

ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు టాప్‌లో ఉన్నారు. రూ.931 కోట్లకుపైగా ఆస్తులు ఆయనకు ఉన్నట్లు పేర్కొంది. చంద్రబాబు స్థాపించిన హెరిటేజ్ డెయిరీ సంస్థలో ఆయన ఫ్యామిలీ సభ్యుల వాటా సంపద పెరిగింది. హెరిటేజ్‌ కంపెనీలో వాటాదారులు 1,81,907 మంది ఉన్నారు. వారంతా జీవితకాలం ఉన్నవారు. ఈ సంస్థ పూర్తిగా డెయిరీ ఉత్పత్తులతో వ్యాపారం చేస్తోంది.


1995లో రూ.25 కోట్లుగా ఉన్న ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2025 నాటికి రూ.4,500 కోట్లకు చేరింది. ఈ సంస్థ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో స్థానం సంపాదించిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.హెరిటేజ్‌ తన ఉత్పత్తిని 1993లో ప్రారంభించింది. 1994లో ఐపీఓ విడుదల చేసింది. 54 రెట్లపైగా వాటాదారులు చేరడంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ఆ కంపెనీని లిస్టింగ్‌ చేశారు.

ALSO READ: ధర్మస్థల కేసులో అసలు ట్విస్ట్.. ముసుగు వ్యక్తి అందర్నీ పిచోళ్లను చేశాడు?

ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆ కంపెనీకి రాజీనామా చేశారు. ఆయన సతీమణి భువనేశ్వరి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆ సంస్థకు ఆమె ఎండీ కాగా, చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే కోవిడ్‌ తర్వాత అప్పు నుంచి ఆ కంపెనీ బయటపడినట్టు తెలుస్తోంది.

సెకండ్ ప్లేస్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండు నిలిచారు. ఆయన ఆస్తులు రూ.332 కోట్లు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య రూ.51 కోట్లలతో థర్డ్ ప్లేస్ దక్కించుకున్నారు.  తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి రూ.30 కోట్ల ఆస్తి ఉండగా, కోటి రూపాయల అప్పు ఉన్నట్లు పేర్కొంది. సంపన్న సీఎంల జాబితాలో 7వ స్థానంలో నిలిచారు.

జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లాకు రూ. 55 లక్షలు కాగా, కేరళ సీఎం పినరయి విజయన్‌కు కోటి ఆస్తి ఉన్నట్టు నివేదిక ప్రస్తావించింది. అప్పుల విషయానికి వస్తే సీఎం పెమా ఖండుకు రూ.180 కోట్లు కాగా, సీఎం సిద్దరామయ్యకు రూ.23 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. ఇక సీఎం చంద్రబాబుకు రూ.10 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొంది.

ఓవరాల్‌గా ఏడీఆర్ రిపోర్టు పరిశీలిస్తే.. 50 కోట్ల దాటిన ముఖ్యమంత్రులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. అదే 11 కోట్ల నుంచి 49 కోట్ల మధ్య 9 మంది ఉన్నారు. అదే ఒక కోటి నుంచి 10 కోట్ల మధ్య 16 మంది కాగా, కోటి లోపు ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రమే ఉన్నట్లు ఆ రిపోర్టు సారాంశం.

Related News

Singapore: తండ్రిని పట్టించిన బాలుడు.. సింగపూర్‌లో భారతీయుడికి జైలు, అసలే మేటరేంటి?

Dharmasthala Twist: ధర్మస్థల కేసులో అసలు ట్విస్ట్.. ముసుగు వ్యక్తి అందర్నీ పిచ్చోళ్లను చేశాడా?

Dongs Attack Man: రౌండ్ వేసి మరీ వ్యక్తిపై దాడి చేసిన వీధి కుక్కలు.. దడ పుట్టిస్తున్న వీడియో

Anil Ambani: అంబానీకి ఊహించని షాక్.. తల్లి ఆస్పత్రిలో ఉండగానే ఇంట్లో సీబీఐ సోదాలు

Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్‌లోని క్లౌడ్ బరస్ట్ బీభత్సం.. అల్లకల్లోలంగా మారిన చమోలీ జిల్లా

Big Stories

×