Yuzvendra chahal : టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన భార్య ధన శ్రీ వర్మకి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ధనశ్రీ వర్మతో విడాకుల తరువాత చాహల్ ఆర్.జే. మహ్వాష్ తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆర్జే మహ్వాష్ తో చాహల్ డేటింగ్ లో ఉన్నట్టు బీ టౌన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ను వీరిద్దరూ కలిసి చూడటం.. మ్యాచ్ కి ముందు ఓ సెల్ఫీ వీడియో, ఫొటోలను ఆమె తన ఖాతాలో పోస్టు చేయడంతో ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ మాత్రమే కాకుండా పలు ఈవెంట్స్ లో కూడా ఇద్దరూ జంటగా మెరిశారు. దీంతో చాహల్ మహ్వాష్ తో ప్రేమలో పడ్డట్టు టాక్ నడుస్తోంది. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ మరో కొత్త పోస్ట్ కూడా పెట్టింది మహ్వాష్.
Also Read : Asia Cup 2025: ఆసియా కప్ 2025 ఆడే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇదే… రషీద్ ఖాన్ కు కెప్టెన్సీ
‘జై మాతాజీ’ అంటూ
ఇటీవల క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ ఒక మ్యాచ్ కి ముందు మ్యాచ్ డే జై మాతాజీ అంటూ పోస్ట్ పెట్టగా.. RJ మహ్వాష్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో చాహల్ పెట్టిన క్యాప్షన్ తో పోస్ట్ పెట్టింది. RJ మహ్వాష్ , తాను సహ యజమానిగా ఉన్న ఛాంపియన్స్ లీగ్ టీ-10టీమ్ సుప్రీమ్ స్ట్రైకర్స్ మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ డే జై మాతాజీ పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరూ మధ్య సీక్రెట్ రిలేషన్ నడుస్తుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. టీమిండియా బౌలర్ చాహల్ తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని.. దయచేసి తప్పుడు వార్తలు రాయవద్దని RJ మహ్వాష్ ఫైర్ అయింది. ఇక ఈ నేపథ్యంలో మరోవార్త వైరల్ అవుతోంది. RJ మహ్వాష్ ఆ పొలిటిషియన్ తో ఎఫైర్ కొనసాగిస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ పొలిటిషన్ తో ఎఫైర్
ఆ పొలిటిషియన్ మరెవ్వరో కాదండోయ్.. యూనియన్ మినిస్టర్, లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ రామ్ విలాస్ పాశ్వాన్. ఇతనితో RJ మహ్వాష్ లవ్ ఎఫైర్ కొనసాగిస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చాహల్ కి షాక్ తగిలిందని.. ఓ వైపు భార్య విడాకులు, ప్రియురాలు మరో వ్యక్తితో ఎఫైర్ అంటూ రకరకాల కామెంట్స్ చేయడం గమనార్హం. వాస్తవానికి చాహల్-ధనశ్రీ వర్మ 2020 డిసెంబర్ 22నపెళ్లి చేసుకుంది. కొరియోగ్రాఫర్ గా, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. పెళ్లి తరువాత వీళ్లిద్దరూ ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉన్నారు. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పార్థాలు విడాకులకు దారి తీశాయి. 2020లో వీరి పెళ్లి జరగ్గా.. 2022 నుంచి ఈ ఇద్దరూ విడివిడిగా ఉంటున్న ఈ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి 20న వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది.