Tejeshwar Murder Case: జోగులాంబ గద్వాల జిల్లాలో తేజశ్వర్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. జూన్ 17 నుంచి కనిపించకుండా పోయిన సర్వేయర్ తేజేశ్వర్ శవమై కనిపించాడు. తేజేశ్వర్ హత్య కేసులో సినిమాను తలపించే విధంగా ట్విస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 13న ఐశ్వర్యతో పెళ్లికి ముహూర్తం నిర్ణయించగా సరిగ్గా అదే రోజు పెళ్లికూతురు వెళ్లిపోయింది. విషయం తెలిసి ఐశ్వర్య తల్లిదండ్రులను పెళ్లికొడుకు పేరెంట్స్ నిలదీశారు. దీంతో పెళ్లి వద్దనుకుని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు పెళ్లి చేసుకునే లాగా పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు.
జూన్ 17నుంచి కనిపించకుండా పోయిన సర్వేయర్ తేజేశ్వర్ మృతి
ఒప్పందం తర్వాత తిరిగి అమ్మాయికి, అబ్బాయికి మధ్య మళ్లీ మాటలు కలిశాయి. పెళ్లికొడుక్కి ఫోన్ చేసి తనకున్న ఇబ్బందులు చెప్పింది. కర్నూలుకు వెళ్లి అమ్మాయిని బైక్ పై ఎక్కించుకొని చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగారు. గమనించిన బంధువులు తేజశ్వర్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. వారు తమ కొడుక్కి నచ్చ చెప్పారు. అమ్మాయి అంత మంచిది కాదని.. వదిలేసుకోమని సీరియస్‌గా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చున్నాడు తేజేశ్వర్. తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మాట వినకుండా.. మే 17వ తేదీన బీచుపల్లిలో ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు తేజేశ్వర్. ఆ తర్వాత అమ్మాయిని తన సొంత ఇంటికి తీసుకువచ్చాడు.
పెళ్లికొడుకును పెళ్లికూతురే కిరాయి మనుషులతో చంపించింది
సరిగ్గా ఇది జరిగిన నెల రోజులకే సర్వేశ్వర్ హత్యకు గురవ్వడం అనుమానాలకు తావిస్తోంది. అమ్మాయి తెనేపూసిన కత్తిలా మారిందని.. అమ్మాయి పెళ్లికి ముందు వ్యవహారం నడిపిన వ్యక్తం సాయంతో ఈ హత్య చేయించినట్టు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నెల రోజుల మేఘాలయా హనీమూన్ ఘటన తలపించే విధంగా సర్వేశ్వర్ హత్య జరిగింది. పెళ్లికి చేసుకుని హనీమూన్ కి వెళ్లింది నవ జంట. ఓ కొండ ప్రాంతంలో పెళ్లికొడుకును పెళ్లికూతురే కిరాయి మనుషులతో చంపించింది. గద్వాల ఘటన కూడా పంథాలో సాగినట్టు కనిపిస్తోంది. పెళ్లికి ముందే అమ్మాయి నడవడిక తేడా ఉండటంతో.. పెళ్లిరోజు మాయమవ్వడం తిరిగిరావడం పెళ్లిచేసుకోవడం ఇదంతా నమ్మశక్యంగా లేదని అబాయి పేరెంట్స్ చెబుతున్నారు. పెళ్లి చేసుకోవద్దని తమ కొడుక్కి చెప్పినా వినలేదని తల్లిదండ్రులు బోరుమంటున్నారు. ఆమెను పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే ప్రాణాలతో ఉండేవాడని గుండెలు బాదుకుంటున్నారు.
హత్య చేశారని మృతుని కుటుంబసభ్యుల ఆరోపణ
ఐశ్వర్య గద్వాల జిల్లా తేజేశ్వర్‌తో ప్రేమలో పడడంతో సహించుకోలేకపోయాడు బ్యాంకు మేనేజర్. అమ్మాయి తల్లితో కలిసి పథకం ప్రకారం తేజేశ్వర్ హత్య చేయించారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన స్నేహితుల ద్వారా ల్యాండ్ సర్వే చేయాలంటూ కర్నూలుకు రప్పించుకున్నాడు సదరు బ్యాంకు మేనేజర్… కర్నూలుకు వచ్చిన తేజేశ్వర్ ను స్నేహితులతో కలిసి మేనేజర్ చంపినట్టు ప్రాథమిక సమాచారం. మృతదేహాన్ని బయటికి తీసిన పాణ్యం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ కేసులో మరికొందరి హస్తం ఉన్నట్లు తెలియడంతో గద్వాల, కర్నూలు పోలీసులు విచారణ వేగం పెంచారు.
భూ సర్వే చేయలంటూ కారులో తీసుకెళ్లి కత్తులతో పొడిచి హత్య
నెల క్రితమే కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో తేజేశ్వర్ కు వివాహం జరిగింది. ఐశ్వర్యకు పెళ్లికి ముందే ఇతర సంబంధాలు ఉన్నాయని మృతుని స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. భూమి సర్వే చేయాలని గుర్తుతెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకొని వెళ్లి నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో చంపి మృతదేహాన్ని అక్కడే పారేసి వెళ్లారు. తేజశ్వర్‌ను కారులో తీసుకెళ్లిన వెళ్లిన బ్యాంకు ఉద్యోగేనని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
బ్యాంకు ఉద్యోగితో ఐశ్వర్య 2000 సార్లు మాట్లాడినట్లు కాల్ డేటా
పెళ్లి తరువాత ఐశ్వర్య ఆ బ్యాంకు ఉద్యోగితో దాదాపు 2 వేల సార్లు మాట్లాడినట్లు కాల్‌డేటా కూడా సేకరించారు. రంగంలోకి దిగిన కర్నూలు, గద్వాల జిల్లా పోలీసులు తేజేశ్వర్ భార్య తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉన్నాడు.
మరోవైపు కర్నూల్ జిల్లా ఓ బ్యాంకు మేనేజర్‌తో ఐశ్వర్య తల్లి సుజాత అక్రమ సంబంధం కొనసాగించినట్టు పోలీసుల ప్రాథమిక సమాచారంలో వెల్లడైంది. తల్లితో పాటు కూతురు ఐశ్వర్య తో కూడా బ్యాంకు మేనేజర్ తిరుమల రావు అక్రమ సంబంధం కొనసాగించారు. బ్యాంక్ మేనేజర్ కు పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడు. విషయం తెలిసుకున్న తిరుమలరావు భార్య కేసు పెడతానని హెచ్చరించడంతో పెళ్లి విరమించుకున్నారు. భార్య బెదిరింపుతో బ్యాంక్ మేనేజర్ నిర్ణయాన్ని మార్చుకోవడంతో ఐశ్వర్య తేజేశ్వర్ ను వివాహం చేసుకుంది. తర్వాత ప్లాన్ ప్రకారం తేజేశ్వర్ ను అడ్డు తప్పించారు.
Also Read: చిక్కిన విదేశీ మహిళలు.. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత అదుపులోకి, ఇంతకీ ఎవరు వీళ్లు?
పెళ్లైన నెలరోజులకే తేజేశ్వర్ హత్య ఘటన మేఘాలయా హనీమూన్ కేసును తలపిస్తోంది. అక్కడ కూడా భార్యే కిరాయి మూకతో భర్తను చంపించింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.