Medchal News: వారిద్దరు ప్రేమించుకున్నారు.. ఆపై పెళ్లి చేసుకున్నారు. సరదాగా సాగిన సంసారంలో ఒక్కసారిగా కలతలు మొదలయ్యాయి. రాను రాను పెరిగి పెద్దవి అయ్యాయి. చివరకు భార్య గర్భవతి అయ్యింది. ఆ సమయంలో భార్యభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదు. పట్టరాని కోపంతో గర్భవతి అయిన భార్యను చంపేశాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన మేడ్చల్ జిల్లా వెలుగుచూసింది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలాజీహిల్స్‌లో ఉంటున్న భార్యను ముక్కలు ముక్కులుగా నరికి చంపాడు భర్త. ఆ తర్వాత బాడీ పార్ట్స్‌ను కవర్‌లో ప్యాక్ చేసి బయట పడేసేందుకు సిద్ధమయ్యాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన 22 ఏళ్ల స్వాతిని లవ్ మ్యారేజీ చేసుకున్నాడు మహేందర్ రెడ్డి.
పెళ్లి తర్వాత ఈ దంపతులు బోడుప్పల్‌లోని బాలాజీహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో కలిసి మెలిసి ఉండేవారు. అయితే భార్యభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదు. కసితో భార్యను చంపేశాడు. రంపంతో తల, కాళ్లు, చేతులు, వేరు చేశాడు. ఆ భాగాలను మూసీ నదిలో పడేశాడు. మిగిలిన మొండాన్ని కవర్‌లో ప్యాక్ చేశాడు మహేందర్ రెడ్డి.
మొండాన్ని తీసుకెళ్లలేక గదిలోనే ఉంచాడు. గది నుంచి శబ్దాలు రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెళ్లి చూడగా వెలుగులోకి అసలు విషయం బయటపడింది. ఈ ఘటన తర్వాత స్వాతి ఆత్మహత్య చేసుకుందని, తన సోదరికి చెప్పాడు మహేందర్‌రెడ్డి. ఈ విషయం గురించి స్వాతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది మహేందర్‌రెడ్డి సోదరి.
ALSO READ: రెండు నెలల్లో 500 కోట్లు.. ఇదేం మోసం, ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు
బంధువులు ఫిర్యాదు చేయడంతో మహేందర్ రెడ్డి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. దంపతులిద్దరు వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడ వాసులుగా గుర్తించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.మహేందర్ రెడ్డి నోరు విప్పితే ఆయన సమాచారం వస్తుందని అంటున్నారు. స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
గర్భవతి అయిన భార్యను చంపి.. ముక్కలు ముక్కలుగా కోసిన భర్త
హైదరాబాద్ నగరం మేడ్చల్-మేడిపల్లి బాలాజీ హిల్స్‌లో దారుణం
భార్య స్వాతిని చంపి, ఆపై రంపంతో ముక్కలు ముక్కలుగా కోసిన భర్త మహేందర్ రెడ్డి
ఆపై శరీర భాగాలను కవర్లలో వేసి, బయటికి తీసుకెళ్లి పారేసేందుకు ప్లాన్
గది నుంచి శబ్దాలు… pic.twitter.com/QoaxIsc17A
— BIG TV Breaking News (@bigtvtelugu) August 24, 2025