BigTV English

OTT Movie : మనిషిని ఇష్టపడే దేవత… విచిత్ర రూపంలో పుట్టే పిల్లలు… వణుకు పుట్టించే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : మనిషిని ఇష్టపడే దేవత… విచిత్ర రూపంలో పుట్టే పిల్లలు… వణుకు పుట్టించే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : ఓటీటీలో మలయాళం సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. అంతలా క్రేజ్ తెచ్చుకున్నాయి ఈ సినిమాలు. ఒకప్పుడు వీటి ఊసే ఎత్తని టాలీవుడ్ ప్రేక్షకులు, ఇప్పుడు వీటి కోసమే నిరీక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అతీంద్రీయ శక్తులతో తెరకెక్కింది. ఇది చివరి వరకూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ మలయాళ ఫాంటసీ-హారర్ మూవీ పేరు’కుమారి’ (Kumari). 2022 లో వచ్చిన ఈ సినిమాకి నిర్మల్ సహదేవ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఐశ్వర్య లక్ష్మీ టైటిల్ రోల్‌లో నటించగా, షైన్ టామ్ చాకో, స్వసిక విజయ్, సురభి లక్ష్మీ, గిజు జాన్, రాహుల్ మాధవ్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ కథ కేరళలోని ఒక గ్రామంలో, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు, అతీంద్రియ శక్తుల చుట్టూ తిరుగుతుంది. ఇది వడక్కన్ ఐతిహ్యమాల నుండి ప్రేరణ పొందింది. 2 గంటల 17 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDbలో 6.4/10 రేటింగ్ ను కలిగి ఉంది. ఈ మలయాళం మూవీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం సబ్‌టైటిల్స్‌తో నెట్ ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులోకి వచ్చింది.


స్టోరీలోకి వెళితే

ఈ సినిమా ఒక అమ్మమ్మ తన మనవరాలికి ఒక దేవత గురించి కథ చెప్పడంతో ప్రారంభమవుతుంది. ఈ దేవత భూమి అందానికి పరవశించి, స్వర్గానికి తిరిగి వెళ్ళకుండా ఒక మానవుడిని వివాహం చేసుకుటుంది. వీళ్ళకు చాతన్, గరి దేవన్ అనే ఇద్దరు సంతానం కలుగుతారు. వీళ్ళు మానవుల్లా కాకుండా అసాధారణ శక్తులతో ఉంటారు. స్టోరీ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. కుమారి (ఐశ్వర్య లక్ష్మీ) ఒక అనాథ అమ్మాయి. ఆమెను తన మామలు, సోదరుడు జయన్ (రాహుల్ మాధవ్) పెంచుతారు. ఆమెకు ధ్రువన్ (షైన్ టామ్ చాకో)అనే వ్యక్తితో వివాహం చేస్తారు. ఈ పెళ్ళి జయన్ కు అంతగా ఇష్టం ఉండడు. ధ్రువన్ మానసిక స్థితి అంత బాగా లేదని ఇతనికి తెలుస్తుంది. ధ్రువన్ ఉండే కన్హిరంగట్ గ్రామం ఒక శాపగ్రస్త భూమిగా ఉంటుంది. కుమారి ఈ కుటుంబంలోకి అడుగుపెట్టినప్పుడు, ఆమెకు మూఢనమ్మకాలతో నిండిన ఆచారాలు వెల్కమ్ చెప్తాయి.

ఈ కుటుంబం చాతన్ శాపంతో బాధపడుతుంటుంది. ఇది పన్నెండు తరాల నుండి వారిని వెంటాడుతోంది. ధ్రువన్ పూర్వీకుడు తుప్పన్, చాతన్ శాపం నుండి రక్షణ కోసం గరి దేవన్‌ను ఆరాధించాడు. కానీ దీనికి ఒక భయంకరమైన నరబలి ఇవ్వాల్సివస్తుంది. తుప్పన్ తన సొంత కొడుకును గరి దేవన్‌కు బలిగా ఇస్తాడు. దీనితో తుప్పన్ భార్య నంగకుట్టి (తన్వి రామ్) ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ బలి గరి దేవన్ కు పన్నెండు తరాల వరకు రక్షణగా ఉంటుంది. అయితే ఇప్పుడు ధ్రువన్ పన్నెండవ తరం వారసుడిగా ఉన్నాడు. అంతే కాకుండా, అతని సంతానం బలిగా ఇవ్వాలని కుటుంబ సాంప్రదాయం డిమాండ్ చేస్తుంది. కుమారి తన మరదలు లక్ష్మీ (స్వసిక విజయ్), ధ్రువన్ సోదరుడు, అచ్యుతన్ (గిజు జాన్) భార్య నుండి కుటుంబ రహస్యాలను తెలుసుకుంటుంది. ఆ తారువాత కుమారి అడవిలోకి వెళ్ళాలని అనుకుంటుంది. అయితే లక్ష్మీ ఈ కుటుంబం అడవిలోకి ప్రవేశించడం ప్రమాదకరమని చెప్తుంది. ఎందుకంటే అక్కడ చాతన్ నివసిస్తాడని వీళ్ళు నమ్ముతుంటారు. అంతే కాకుండా పూర్వీకుల చర్యల కారణంగా అతని శాపం వారిని వెంటాడుతోంది.

కుమారి చాతన్ శాపంకు లోనై అడవిలోకి వెళుతుంది. అక్కడ ఆమె ముత్తమ్మ (సురభి లక్ష్మీ) అనే స్త్రీని కలుస్తుంది. ముత్తమ్మ, కుమారి గర్భవతి అని, ఆమె బిడ్డ ధ్రువన్ కారణంగా ప్రమాదంలో ఉందని హెచ్చరిస్తుంది. కుమారి ప్రెగ్నెంట్ అని అందరికీ తెలుస్తుంది. ఈ కుటుంబంలో ధ్రువన్ తప్ప, ఆమె గర్భం గురించి సంతోషించరు. ఇప్పుడు లక్ష్మీ కుమారికి ఒక భయంకరమైన సీక్రెట్ చెప్తుంది. గరి దేవన్ రక్షణను కొనసాగించడానికి, ధ్రువన్ తన బిడ్డను బలి ఇవ్వాల్సి ఉంటుందని తెలియజేస్తుంది. ఈ విషయం తెలుసుకుని కుమారి చాలా బాధపడుతుంది. తన భర్త అలా చేయడని అనుకుంటుంది. ఇక స్టోరీ ముందుకు వెళ్ళే కొద్ది వాతావరణం ప్రమాదకరంగా మారుతుంది. చివరికి ధ్రువన్ తన బిడ్డను బలి ఇస్తాడా ? ఈ శాపం ఎలా పోతుంది ? కుమారి ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటుంది? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఈ స్కూల్ లో తప్పు చేస్తే లేపేస్తారు… ‘స్క్విడ్ గేమ్’ లాంటి అదిరిపోయే థ్రిల్లర

Related News

OTT Movie : అందమైన అమ్మాయే ఈ దెయ్యం టార్గెట్… బెడ్ పై కూడా వదలకుండా… బతికుండగానే నరకం అంటే ఇదే

OTT Movie : ఆల్మోస్ట్ అన్ని దేశాలలో బ్యాన్ చేసిన డేంజరస్ మూవీ… గర్ల్స్, బాయ్స్ ని బంధించి ఇవేం పాడు పనులు సామీ ?

OTT Movie : డేంజరస్ ఐలాండ్… అడుగు పెడితే అబ్బాయిల కోసం పడి చస్తారు… సింగిల్ గా చూడాల్సిన ఏరోటిక్ థ్రిల్లర్

OTT Movie : కిరాయి సైనికుల చేతుల్లోకి ప్రపంచాన్ని అంతం చేసే ఆయుధం… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులున్న స్పై థ్రిల్లర్

OTT Movie : ప్రధానమంత్రి భర్త మిస్సింగ్… సీను సీనుకో ట్విస్ట్… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే ఇంటర్నేషనల్ పొలిటికల్ థ్రిల్లర్

OTT Movie : ఆగస్టు లాస్ట్ వీక్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

Big Stories

×