E-Paper
Advertisement

Road Accident: డివైడర్‌ని ఢీకొట్టి బోల్తా పడిన బస్సు.. జమ్మూకాశ్మీర్‌లో ఘటన, స్పాట్‌లో 35 మంది విద్యార్థులు

Road Accident: డివైడర్‌ని ఢీకొట్టి బోల్తా పడిన బస్సు.. జమ్మూకాశ్మీర్‌లో ఘటన, స్పాట్‌లో 35 మంది విద్యార్థులు
Advertisement

Road Accident: 2025 ఏడాది ఊహించని విధంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా జమ్మూకాశ్మీర్‌లో ఓ పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 35 మంది విద్యార్థులు గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఘటన ఎలా జరిగింది?

జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం

Advertisement

జమ్మూకాశ్మీర్‌లోని బిష్నా ప్రాంత సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కనీసం 35 మంది పాఠశాల విద్యార్థులు గాయపడ్డారు. స్కూల్ విద్యార్థులు పిక్నిక్ వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు.

ఘటన నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులు, ఎయిమ్స్, జీఎంసీ ఆసుపత్రికి తరలించారు. స్కూల్ బస్సు రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టడంతో బ్యాలెన్స్ కోల్పోయింది. ఫలితంగా బస్సు బోల్తాపడినట్టు విద్యార్థులు చెబుతున్నారు.

Advertisement

డివైడర్‌ని ఢీకొట్టి బోల్తా పడిన బస్సు

ప్రాగ్వాల్ సరిహద్దు ప్రాంతం నుంచి ఓ పాఠశాల నుండి 40 మంది విద్యార్థులు, 10 మంది బోధనా సిబ్బందితో పిక్నిక్‌కు బస్సు బయలు దేరింది. సాంబాలో ఒక రోజు పిక్నిక్ చేసుకున్నారు. తిరిగి పాఠశాలకు బయలుదేరారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా బిష్నా ప్రాంతంలోని రత్నల్ సమీపంలోని రింగ్ రోడ్ వద్ద డివైడర్‌నుబలంగా ఢీకొట్టింది బస్సు.

స్టీరింగ్‌పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు బోల్తా పడింది.  సమీపంలోని పోలీసులు, స్థానికులు రంగంలోకి దిగారు. గాయపడిన విద్యార్థులను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాన్ని సైడుకి పెట్టి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు పోలీసులు.  దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: రేయ్.. మీరు మనుషులా.. కుక్కలా? మరీ ఆ ప్లేస్ లో కొరకొచ్చా?

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×