E-Paper
Advertisement

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ-స్పాట్‌లో ముగ్గురు మృతి

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ-స్పాట్‌లో ముగ్గురు మృతి
Advertisement

Road Accident: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దవుర మండలం రామన్నగూడెం గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రెండు కార్లలోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

నల్లగొండ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దవూర మండలంలోని రామన్నగూడెం సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ప్రమాద తీవ్రతకు కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి.అంతేకాదు ఓ కారులో ఎయిర్ బెలూన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఈ రెండు వాహనాలు ఎంత వేగంగా వస్తున్నాయో దీన్ని బట్టి తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో స్పాట్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ఈలోగా అంబులెన్స్ కూడా అక్కడికి వచ్చింది. క్షతగాత్రులను అంబులెన్సులో సమీప ఆసుపత్రికి తరలించారు.

Advertisement

రెండు కార్లు ఢీ-స్పాట్‌లో ముగ్గురు మృతి

మృతులను సాయికుమార్, థాంసయ్య, ప్రకాశ్‌రావుగా గుర్తించారు స్థానికులు. కారు నెంబరు ప్లేట్ ఆధారంగా కారులోని వారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ ఘటనకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

 

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×