E-Paper
Advertisement

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. అత్యంత చౌకగా లభించే.. టాప్-5 ఖరీదైన ఫోన్లు ఇవే!

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. అత్యంత చౌకగా లభించే.. టాప్-5 ఖరీదైన ఫోన్లు ఇవే!
Advertisement

Flipkart Freedom Sale 2026: ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్ కార్ట్ ప్లస్, బ్లాక్, వీఐ మెంబర్లకు మాత్రం ఒక రోజు ముందే (ఆగస్టు 7) సేల్ అందుబాటులోకి రానుంది. అయితే కొత్తగా ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి ఈ సేల్లో అతి తక్కువ ధరకే మెుబైల్స్ లభించనున్నాయి. కొన్ని పవర్ ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై ఏకంగా రూ. 20,000 కంటే ఎక్కువ తగ్గింపు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్ సేల్లో భారీ డిస్కౌంట్ లో లభించే అవకాశమున్న టాప్ – 5 మెుబైల్స్ వాటిపై లభించే ఆఫర్ వివరాలను ఈ కథనంలో చూద్దాం.

శాంసంగ్ గెలాక్సీ S25

ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఫోన్‌లలో ‘శాంసంగ్ గెలాక్సీ S25’ ముందు వరుసలో ఉంది. ఈ ఫోన్ లాంచ్ ధర రూ. 80,999 కాగా.. సేల్‌లో ఆఫర్లు పోను దాదాపు రూ. 57,999 లభించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఫ్లిప్ కార్ట్ రిలీజ్ చేసిన ఆఫర్లలో ఇదే అతిపెద్ద డిస్కౌంట్‌గా కనిపిస్తోంది.

యాపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్

Advertisement

యాపిల్ లవర్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ లో ప్రత్యేక ఆఫర్లను అందించనుంది. సేల్ కు సంబంధించి ప్రమోషనల్ టీజర్ ను బట్టి చూస్తే.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ అసలు ధర రూ. 1,49,900 పై రూ. 8,000 తగ్గి రూ. 1,41,900 కి లభించనుంది. దీనికి తోడుగా ఎస్‌బీఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్లకు రూ. 5,000 స్పాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫలితంగా ఈ ఫోన్ ను రూ. 1,36,900 కి దక్కించుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్ 17

ఐఫోన్ 17 బేసిక్ మోడల్ కూడా ఈ సేల్‌లో రూ. 80,000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని లాంచ్ ధర రూ. 82,900 కాగా.. బ్యాంక్ ఆఫర్ల ఆధారంగా దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

నథింగ్ ఫోన్ 4a ప్రో

Advertisement

ఇక మిడ్-రేంజ్ విభాగంలో నథింగ్ ఫోన్ 4a ప్రో మెుబైల్ కూడా మంచి ఆఫర్ లో లభించనుంది. ప్రస్తుతం రూ. 49,999 కి విక్రయిస్తున్న ఈ ఫోన్.. సేల్ ఆఫర్లలో భాగంగా రూ. 43,999 లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అంటే కొనుగోలుదారులు నేరుగా రూ. 6,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

Also Read: రూ. 3 వేల కోట్ల స్కామ్.. ఐదు ప్రాంతాల్లో ఇళ్లు-ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. షాకైన విశాఖ వైసీపీ నేత విజయప్రసాద్‌

గూగుల్ పిక్సెల్ 10

ఇక ఈ ఫ్రీడమ్ సేల్‌లో ‘గూగుల్ పిక్సెల్ 10’ కూడా క్రేజీ ఫ్లాగ్‌షిప్ డీల్‌గా మారే ఛాన్స్ ఉంది. లాంచ్ సమయంలో రూ. 79,999 గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్.. బ్యాంక్ ఆఫర్లతో సంబంధం లేకుండానే నేరుగా రూ. 17,000 తగ్గింపుతో రూ. 62,999 కి లభించనుంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్లు కలిపితే దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

Also Read: వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు జరగడం ఎక్కువ.. స్కూటీ నడిపే సమయంలో ఈ 10 జాగ్రత్తలు పాటించాలి

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×