E-Paper
Advertisement

రైల్లో తలతిక్క వేషాలు.. వీణ్ణి బొక్కలో వేసి మక్కెలు విరగ్గొట్టండి సర్!

రైల్లో తలతిక్క వేషాలు.. వీణ్ణి  బొక్కలో వేసి మక్కెలు విరగ్గొట్టండి సర్!
Advertisement

India Railway Viral Video: గత కొంతకాలంగా రైళ్లలో కొందరు యువకులు ఆకతాయి చేష్టలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా కోసం వీడియోలు తీయడం, ప్రమాదకరమైన స్టంట్లు చేయడం, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం వంటి సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రైల్లో యువకుల ఆకతాయి పనులు

వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు రైలులోని విండోను ధ్వంసం చేయడంతో పాటు, స్విచ్‌లు, ఇతర పరికరాలను కూడా పగులగొడుతున్నట్లు కనిపిస్తోంది. అతడితో పాటు మరికొందరు యువకులు కూడా ఈ చర్యల్లో పాల్గొన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. రైల్వే ఆస్తులను కావాలని ధ్వంసం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల పన్నుల డబ్బుతో ఏర్పాటు చేసిన రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం ఏమాత్రం సమంజసం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరికొందరు కూడా ఇదే తరహా పనులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

రైల్వే మంత్రి నెటిజన్ల రిక్వెస్ట్!

Advertisement

అంతేకాకుండా, ఈ వీడియోను పలువురు సోషల్ మీడియా వినియోగదారులు రైల్వే మంత్రిని ట్యాగ్ చేస్తూ సంబంధిత వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వీడియోలో కనిపిస్తున్న యువకులను గుర్తించి, రైల్వే ఆస్తులకు జరిగిన నష్టాన్ని వారితోనే కట్టించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ఏ రైలులో తీశారు. ఏ మార్గంలో ప్రయాణిస్తోంది? ఈ ఘటన ఎప్పుడు జరిగింది? లాంటి వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. త్వరలోనే నిందితులను పట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు రైల్వే మంత్రిని కోరుతున్నారు.

Advertisement

Read Also: ఐఆర్‌సిటీసీ క్యాటరింగ్‌ కు షాక్.. ఏకంగా రూ.5.13 కోట్ల ఫైన్!

రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం తీవ్ర నేరం

రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం భారతీయ చట్టాల ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి చర్యలు ప్రయాణికుల భద్రతను కూడా ప్రమాదంలో పడేస్తాయి. విండోలు, స్విచ్‌లు, ఇతర పరికరాలు ధ్వంసమైతే తర్వాత ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఈ వీడియోపై రైల్వే శాఖ ఎలా స్పందిస్తుంది? వైరల్ వీడియో ఆధారంగా సంబంధిత వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటుందా? అనేది చూడాలి.

Read Also: బుల్లెట్ రైల్లో భోజనం ఇలా ఉంటుందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!

Tags

Related News

ఒక రైల్ ఇంజిన్ ఎన్ని బోగీలను లాగగలదు.. రైల్వే బోగీల సంఖ్య ఎందుకు పెంచదు?

పండగకు ఊరెళ్లేవారికి సూపర్ న్యూస్.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ రైళ్లు!

సికింద్రాబాద్–వరంగల్ మార్గంలో నాలుగు రైళ్లు రద్దు, ఎప్పుడంటే?

రైలు 9 గంటలు లేట్.. ప్రయాణికుడికి రూ.35 వేల పరిహారం.. అసలు ఏం జరిగిందంటే?

20 గంటల ప్రయాణం ఇక 7 గంటలే.. మరో బుల్లెట్ రైలు కారిడార్ కు గ్రీన్ సిగ్నల్!

రూ.50,000 బడ్జెట్‌లో ఫారిన్ టూర్.. ఫ్రెండ్స్‌తో కలిసి మలేషియా ట్రిప్ ఇలా ఎంజాయ్ చేయండి

తెలంగాణకు గుడ్ న్యూస్.. కొత్త రైల్వే లైన్ వచ్చేస్తోంది!

దీపావళికి ముందే రెండో వందే భారత్ స్లీపర్ ఎంట్రీ.. ఏ రూట్ లో పరుగులు తీస్తుందంటే?

Big Stories

Advertisement
×