E-Paper
Advertisement

Road Accident in Rajasthan: ట్రక్కును ఢీకొట్టిన కారు..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం

Road Accident in Rajasthan: ట్రక్కును ఢీకొట్టిన కారు..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం
Advertisement

Road Accident in Rajasthan(Telugu news updates): రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జైత్‌పూర్ నుంచి హనుమాన్ గఢ్ వెళ్తున్న ఓ కారు గురువారం అర్ధరాత్రి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. బికనీర్ ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వస్తున్న కారు..వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, వీరంతా హర్యానాలోని దబ్వాలీ వాసులుగా గుర్తించారు. ట్రక్కును వేగంగా ఢీకొట్టడంతో.. కారు నుజ్జునుజ్జు అయింది. ఈ కారులో ప్రయాణిస్తున్న వారంతా మృతిచెందారు.

Advertisement

అర్థరాత్రి కావడంతో ముందు వెళ్తున్న ట్రక్కు.. కారు డ్రైవర్ కు సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు లుంకరన్ సర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పోలీస్ ఆఫీసర్ నరేంద్ర పునియా తన బృందంతో కలిసి సంఘటనా స్థలంలో పరిశీలించారు. వెంటనే సమీపంలోని టోల్ ప్లాజా అంబులెన్స్ రావడంతో మృతదేహాలను కారులో నుంచి తీసేందుకు ప్రయత్నించారు. కానీ కారులో చిక్కుకోవడంతో వీలుకాలేదు. దీంతో క్రేన్ ను రప్పించారు.

ప్రమాదం చాలా తీవ్రంగా ఉండడంతో అతికష్టం మీద క్రేన్ సహాయంతో అందరినీ బయటకు తీశారు. అందులో ఒక్క బాలిక ప్రాణాలతో ఉండగా..వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలో మృతతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×