BigTV English

Entertainment: బాలయ్య ఓనెల రోజులు రాజస్థాన్ లోనే మకాం..ఎందుకో తెలుసా?

Entertainment: బాలయ్య ఓనెల రోజులు రాజస్థాన్ లోనే మకాం..ఎందుకో తెలుసా?

Balakrishna One Month Shedule plan to shoot 109 movie at Rajasthan


మూడోసారి హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలయ్య అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ వయసులో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ యువ హీరోలకు రూల్ మోడల్ గా నిలుస్తున్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి చిత్రాల విజయంతో జొష్ మీద ఉన్న బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సితారా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో వచ్చే తన 109 వ చిత్రం షూటింగ్ పూర్తిచేయడంపై దృష్టి సారించారు.

కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసమే..


ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఈ నెల 21న యూనిట్ సభ్యులతో కలిసి రాజస్థాన్ కు వెళ్లనున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఈ కీలక సన్నివేశాలు ఉంటాయని దర్శకుడు బాబీ చెబుతున్నారు. ఈ మూవీలో బాలయ్యకు ప్రతి నాయకుడిగా బాబీ డియోల్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ప్రియమణి,ఊర్శశి రౌతేలా ను ఎంపిక చేశారు.

పరిశీలనలో..వీర మాస్

ఈ మూవీకి ముందు నుంచి టైటిల్ కూడా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ మూవీకి వీర మాస్ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో చిత్ర నిర్మాతలు ఇంతవరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారని సమాచారం. వచ్చే సంక్రాంతికి ఈ మూవీని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. 1990 బ్యాక్ డ్రాప్ లో కొంతభాగం, ప్రస్తుత కాలంలో కొంత భాగం ఉండనుందని తెలుస్తోంది. అంటే పూర్తిగా పీరియాడిక్ కాకుండా కొంత ఈ కాలానికి జోడిస్తూ కథాంశం ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. బాలయ్య సినిమా అంటేనే యాక్షన్, డైలాగ్స్ ఆశిస్తారు అంతా. అభిమానులు మెచ్చే విధంగా ఉంటుందని దర్శకుడు బాబీ చెబుతున్నారు.

వాల్తేర్ వీరయ్య తర్వాత..

గత ఏడాది వాల్తేర్ వీరయ్య లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు బాబీ డాన్ శ్రీను, బలుపు, జై లవకుశ లాంటి చిత్రాలు అందించారు. వాల్తేర్ వీరయ్య సినిమాకు ముందు చెప్పి మరీ సూపర్ హిట్ ఇచ్చారు చిరంజీవికి. ఇప్పుడు కూడా బాలయ్య 109వ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు బాబీ. ఈ చిత్రం అన్ని వర్గాల వారికి విందు భోజనం లా ఉంటుందని అంటున్నారు. పైగా సంక్రాంతికి వచ్చే బాలకృష్ణ సినిమా అంటేనే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అభిమానులంతా తమ నిజమైన సంక్రాంతిగా బాలయ్య బాబు సినిమాలను ఫీలవుతుంటారు. మరి ఫ్యాన్స్ అంచనాలను బాబీ ఎలా రీచ్ అవుతాడో..వాళ్లను ఎలా మెప్పిస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ సినిమాలంటేనే డైలాగులు. గతంలో పరోక్షంగా అప్పటి వైఎస్ఆర్ సీపీ పార్టీపై చాలానే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవన్నీ థియేటర్లలో భారీగానే పేలాయి. కానీ ప్రస్తుతం ఏపీలో తమ పార్టీకి చెందిన సొంత బాబే సీఎం. పైగా బీజేపీ, జనసేనతో దోస్తీ. అందుకే ఇప్పుడు అటు రాష్ట్రం, ఇటు కేంద్రం పై ఎలాంటి వ్యంగ్యాస్త్రాలు ఉండవని అనుకుంటున్నారు. అన్ని వర్గాలు మెచ్చుకునేలా తీస్తానని దర్శకుడు బాబీ భరోసా ఇస్తున్నారు.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×