E-Paper
Advertisement

Road Accident: సికింద్రాబాద్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌కి వెళ్తుండగా మృత్యు ఒడిలోకి

Road Accident: సికింద్రాబాద్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌కి వెళ్తుండగా మృత్యు ఒడిలోకి
Advertisement

Road Accident: టూ వీలర్స్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పదే పదే నివేదికలు చెబుతున్నాయి. అయినా వాహనదారులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఫలితంగా నిండు నూరేళ్లు జీవించాల్సిన యువతీ యువకులు అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. అలాంటి ఘటన ఒకటి సికింద్రాబాద్‌లో జరిగింది. అసలేం జరిగింది?

సికింద్రాబాద్‌లో ఘోర ప్రమాదం

Advertisement

సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి క్రాస్ రోడ్ సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు చోటుచేసుకుంది.పాఠశాలకు వెళ్తున్న ఓ చిన్నారి వాహనం రోడ్డుపై పడింది. వెనుక నుంచి వస్తున్న ఆర్మీ ట్రక్కు వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

స్కూల్‌కి వెళ్తున్న ఆ బాలుడు నేరుగా మృత్యు ఒడికి చేరుకున్నాడు. తల్లి కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయాడు కుమారుడు. అప్పటివరకు తనతో పాటు ముచ్చట్లు చెప్పిన కొడుకు క్షణాల్లో విగతజీవిగా మారడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరు అవుతోంది. మృతుడి తండ్రి ఆర్మీలో జవాన్‌గా ఉన్నాడు.

Advertisement

టూ వీలర్‌పై దూసుకెళ్లిన వాహనం..  మృత్యు ఒడిలోకి బాలుడు

ప్రతిరోజూ మాదిరిగానే తల్లి.. కొడుకుని స్కూల్‌లో దించడానికి స్కూటీపై తీసుకెళ్తోంది. తిరుమలగిరి మెయిన్ రోడ్డుపై వాళ్లు వెళ్తుండగా వాహనం ఒక్కసారిగా స్కిడ్ అయ్యి కింద పడిపోయారు. వెనుక నుంచి వస్తున్న ఆర్మీ ట్రక్కు వారిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రక్కు చక్రాలు బాలుడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ALSO READ: అనంతపురం జిల్లాలో దారుణం.. అనుమానంతో భార్య గొంతు కోసిన తర్వాత

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వచ్చి బాలుడిని కాపాడే ప్రయత్నం చేశారు. ఐనప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కళ్ల ముందే కొడుకు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి ఆ తల్లి షాక్‌కు గురైంది. ఆ సన్నివేశం అక్కడివారిని తీవ్రంగా కలచివేసింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కంటోన్మెంట్ ఏరియాలో ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ, ఇలాంటి ప్రమాదాలు జరగడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీగా ఉండే పాఠశాల వేళల్లో భారీ వాహనాల రాకపోకలపై నియంత్రణ ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×