E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లో ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లో ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
Advertisement

Road Accident:  వరుసగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. ఒక్క ప్రమాదం అయితే మిగత వారు జాగ్రత్త పడతారు అనుకుంటే ఇంకా ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. అంతేకాని తగ్గడం లేదు.. ఇప్పుడు మళ్లీ ఏపీలో ఒకేసారి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు స్పాట్‌లో మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు..

Advertisement

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రెడ్డి నగర్ కెనాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చీమకుర్తి నుండి ఒంగోలు వెళుతున్న గ్రానైట్ కంటైనర్ ఢీ కొనడంతో ద్విచక్ర వాహన దారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు క్రిస్టియన్ పాలెంకు చెందిన 38 ఏళ్ల చంద్రాల ఏడుకొండలుగా గుర్తించారు.

మరో ద్విచక్ర వాహనదారుడైన సంతనూతలపాడు మండలం ఎండ్లూరు గ్రామానికి చెందిన సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఏడుకొండలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

కడప జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఒకరు మృతి, పలువురికి గాయాలు..

కడప జిల్లా బద్వేల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడెం – గుంతపల్లి మార్గమధ్యలో కారు బోల్తా కొట్టడంతో స్పాట్‌లోనే వృద్ధురాలు పెద్ద లక్ష్మమ్మ మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నుంచి నెల్లూరు జిల్లా కందుకూరు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×