Sangareddy Crime: మహిళలు మహారాణులు.. అంబరాన్ని అందుకుంటున్నారు.. సముద్రపు లోతులను కొలుస్తున్నారు.. అయితే అత్తవారింటి వేధింపులకు ఎంతటివారైనా బలి అవుతున్నారు. చదువు, ఆర్ధిక పరిస్థితి ఇవి ఏమీ అత్తవారింటి వేధింపుల నుంచి రక్షించలేవు.. అయితే వాటినుంచి తప్పించుకోవడానికి కొంతమంది ఆత్మహత్య చేసుకుని తమ నిండు నూరేళ్ళ జీవితానికి ముగింపు పలుకుతున్నారు.
తాజాగా ఓ వివాహతి అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో.. అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఇద్దరి పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు పిల్లలకు కత్తితో గాయాలు చేసి రేష్మా ఉరివేసుకొని చనిపోయింది. పిల్లలద్దరిని సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. రామాయంపేటకు చెందిన రేష్మాబేగంకి సంగారెడ్డి జిల్లా కానుకుంటకి చెందిన అహ్మద్‌తో 2019లో వివాహం జరిగింది. గత కొన్నాళ్లుగా అదనపు కట్నం కోసం భర్త మృతిరాలిని హింసించడంతో ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న గుమ్మడిదల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటికి దీపం ఇల్లాలని.. కార్యేసు దాసి కరణేసు మంత్రని ఇల్లాలు గురించి గొప్పలు ఎన్నో చెబుతుంటారు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారని అంటుంటారు. కానీ ఇల్లాలికి అత్తారింట్లో అడుగడుగున నరకమే.. వరకట్న వేధింపులని, ఇతర కారణాలతో చిత్ర హింసలు పెడుతున్నారు. ఇప్పటికీ ఇలాంటి వేధింపులతో బలౌవుతున్న మహిళలు ఎందరో..
పెళ్లంటే నూరేళ్లపంట.. కానీ ప్రస్తుతం రోజుల్లో మూడునాళ్ల ముచ్చటగా మారింది. కట్నం కోసం హింసించి తాళి కట్టిన భార్యను కాటికి పంపుతున్నారు. అత్తంటికి ఆరళ్లు, ఆడపజడుచుల అత్తింటివారి సూటిపోటి మాటలతో మహిళల ఉసురు తీసుకుంటున్నారు.
Also Read: జైలు నుంచి విడుదలైన ఖైదీ.. నేరుగా వెళ్లి పొరుగింటి మహిళ హత్య..
పెళ్లి జీవితంలో ఎవరికైనా మధుర జ్ఞాపకం.. కానీ కొన్ని పెళ్లిళ్లు మహిళలకు మూన్నాళ్ల ముచ్చటగానే మిగులుతున్నాయి. మగాళ్లతో సమానంగా చదివి ఉద్యోగం చేస్తున్నా.. మహిళలు వివక్షకు గురవుతున్నారు. అదనపు కట్నం కోసం మానసికంగా హింసించి, ఆత్మహత్య చేసుకునేందుకు కారణం అవుతున్నారు కొందరు. ఆడపిల్ల అత్తంటి వారింట్లో సంతోషంగా ఉండాలని.. తాహతకు మించి కట్న కానుకలు ఇస్తున్నారు తల్లిదండ్రులు.. అయినా కట్నం కోసం, దాహం తీరని కొందరు మగాళ్లు.. అదనపు కట్నం కోసం రాక్షసంగా మారుతున్నారు. చిత్రహింసలకు గురిచేస్తున్నారు. కోరిన కట్నం ఇవ్వలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక మహిళలు సూసైడ్ చేసుకుంటున్నారు. వరకట్న వేధింపులకు ఇప్పటికీ బలౌతున్నారు మహిళలు.