Prisoner Kills Woman| ఇటీవల జైలు నుంచి విడుదలైన ఓ ఖైదీ తన పొరుగింట్లో నివసించే ఓ మహిళను హత్య చేశాడు. ఆ హత్య జరిగిన తీరు స్థానికంగా కలకలం రేపింది. పొరుగింటి మహిళను సాయం కోరి ఆమె ఇంట్లోకి వెళ్లి టివి సౌండ్ పెంచాడు. ఆ తరువాత హత్య చేసి ఇంట్లో ఉన్న బంగారం మొత్తం దోచుకెళ్లాడు. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కల్యాణ్ ప్రాంతంలో నివసించే చాంద్ షేక్ అలియాస్ అక్బర్ అనే యువకుడు గతంలో ఒక గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ గా పనిచేసేవాడు. ఆ సమయంలో అతను మరో యువకుడితో కలిసి హత్యలు, దోపిడీలు చేశారు. ఈ నేరాలకు గాను చాంద్ షేక్ కు కర్టు జీవితకాల ఖైదు శిక్ష విధించింది. అయితే జైలులో కొన్ని సంవత్సరాలు గడిపిన తరువాత అతని ప్రవర్తను చూసి జైలు నుంచి విడుదల చేశారు. జైలు నుంచి విడుదల కాగానే చాంద్ షేక్ కల్యాణ్ లోని తన పాత ఇంట్లో నివసించేందుకు తిరిగి వచ్చాడు.
అయితే తన పొరుగింట్లో ఒక మహిళ ఒంటరిగా నివసిస్తోందని తెలిసి అతడు మళ్లీ దోపిడీ చేయాలని ప్లాన్ చేశాడు. అందుకే మార్చి 20న పొరుగింటిలో నివసించే రంజనా పాటేకర్ అనే 60 ఏళ్ల ను టార్గెట్ చేశారు. ఆ రోజు ఆమె ఇంటికి వెళ్లి తనకు దాహంగా ఉందని కాస్త మంచినీరు కావాలని అడిగాడు. దీంతో అతనికి సాయం చేసేందుకు ఆమె నీళ్ల కోసం లోపలికి వెళ్లింది. ఆ సమయంలో చాంద్ షేక్ కూడా ఆమె వెనకాలే లోపలికి ప్రవేశించాడు. ఆమె కిచెన్ లో ఉండగా.. టివి సౌండ్ పెంచేశాడు. ఆ తరువాత ఆమెను చితకాబాది కింద పడేశాడు. అంతటితో ఆగక.. ఆమె గొంతుని తాడుతో బిగించేసి ఊపిరాడకుండా చంపేశాడు. ఆ తరువాత తీరికిగా ఇల్లంతా వెతికి అక్కడి నుంచి రూ.లక్ష విలువ చేసే బంగారాన్ని తీసుకెళ్లాడు.
వివాహేతర సంబంధం కోణంలో విచారణ
ఈ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టి.. చనిపోయిన మహిళకు వివాహేతర సంబంధం కోణంలో దర్యాప్తు చేశారు. కానీ ఎటువంటి క్లూ లభించలేదు. అయితే అనుకోకుండా ఆ ప్రాంతంలో అనుమాస్పదంగా తిరుగుతూ చాంద్ షేక్ కనిపించాడు. దీంతో ఆ ప్రాంతంలోని సిసిటీవి వీడియోలన్నీ గాలించారు. హత్యకు గురైన మహిళ ఇంట్లో చాంద్ షేక్ వెళ్లడాన్ని ఆ పరిసరాల్లోని ఒక సిసిటీవి కెమెరాలో రికార్డ్ అయింది. దాన్ని బట్టి చాంద్ షేక్ ని పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు గట్టిగా ప్రశ్నించగా.. చాంద్ షేక్ హత్య చేసినట్లు అంగీకరించాడు.
Also Read: రైలు నుంచి విసిరిన వాటర్ బాటిల్ తగిలి బాలుడు మృతి.. లోకో పైలట్‌పై కేసు
పోలీసులు ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడుతూ.. “చాంద్ షేక్ గతంలో వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ గా పనిచేసేవాడు. అతడు డెలివరీ సమయంలో ఒంటరిగా నివసించే మహిళలను టార్గెట్ చేసేవాడు. తన స్నేహితుడితో కలిసి అతను 2014లో హత్యలు, దోపిడీలు చేశాడు. తరువాత వారిద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. కోర్టు ఇద్దరికీ జీవిత ఖైదు శిక్ష విధించింది. కానీ జైల్లో చాంద్ షేక్ మంచి ప్రవర్తన కనబర్చడంతో 8 నెలల క్రితం విడుదలయ్యాడు. అయితే అతను డబ్బు కోసం మళ్లీ తప్పుడు మార్గంలో వెళ్లాడు.ఈ క్రమంలో పొరుగింట్లో నివసించే రంజనా పాటేకర్ ని హత్య చేసి ఆమె ఇంట్లో దోపిడీ చేశాడు.” అని చెప్పారు.