BigTV English

Health benefits: చేతితో తింటున్నారా? ఇలా అవుతుందని మీరు అస్సలు ఊహించి ఉండరు

Health benefits: చేతితో తింటున్నారా? ఇలా అవుతుందని మీరు అస్సలు ఊహించి ఉండరు

Big Tv Live Originals: వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత చాలా మంది భోజనం చేయడానికి స్పూన్‌లు, ఫోర్క్‌లను మాత్రమే ఉపయోగిస్తున్నారు. చేతులతో తినడం పాతకాలం పద్ధతి అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది లక్షలాది మంది ఇష్టపడే సంప్రదాయం. ముఖ్యంగా ఇండియా, ఇథియోపియా, మిడిల్ ఈస్ట్ వంటి ప్రదేశాలలో ఎక్కువగా చేతులతోనే తింటారు.


ఇప్పుడు చాలా మంది చేతులతో భోజనం చేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. కానీ, చేతులతో తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు చేతులతో భోజనం చేస్తే ఎలాంటి లాభాలు ఉన్నయో ఇప్పుడు తెలుసుకుందాం..

జీర్ణక్రియ
చేతులతో తినేటప్పుడు, ఆహారం నోటిలోకి వెళ్లడానికి ముందే దాన్ని తాకుతారు. ఇది మీ మెదడుకు సంకేతాలను పంపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కడుపు జీర్ణక్రియకు సిద్ధమైపోతుందట. దీని వల్ల కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్స్ విడుదల అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయిపోతుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరం సమస్యలు కూడా దూరమైపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట.


మైండ్‌ఫుల్‌నెస్‌
చేతులతో తినడం వల్ల మీరు వేగాన్ని తగ్గించి మీ భోజనంపై దృష్టి పెడతారట. మీరు ఆహారం యొక్క ఆకృతి, రుచి వంటి వాటిపై శ్రద్ధ వహిస్తారు. ఈ మైండ్‌ఫుల్‌నెస్ ఆహారాన్ని ఎక్కువగా ఆస్వాదించడానికి సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అతిగా తినకుండా ఉడేందుకు కూడా ఇది సహాయపడుతుందట.

జ్ఞానేంద్రియాలు
ఆహారాన్ని తినకముందే చేతితో తాకినప్పుడు అది మృదువైన బియ్యం, క్రిస్పీ కూరగాయలు లేదా క్రీమీ సాస్‌ లాగా ఉందనేది వెంటనే అనుభూతి చెందవచ్చు. రుచికరమైన ఆహారాన్ని మంచి వాసన ద్వారానే ఆస్వాదించడానికి సహాయపడుతుంది. అందుకే చేతులతోనే భోజనం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పరిశుభ్రత
చేతులతో భోజనం చేయడం వల్ల పరిశుభ్రత కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ, తినడానికి ముందు, తర్వాత మీరు మీ చేతులను బాగా కడుక్కోవడం వల్ల పరిశుభ్రత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రక్తప్రసరణ
చేతివేళ్ల నరాల చివరలు ఉంటాయి. ఆహారాన్ని తాకినప్పుడు, ఈ నరాలు ఉత్తేజితమవుతాయి. ఈ తర్వాత మెదడుకు సంకేతాలను పంపుతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని, మెదడు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుందని నిపుణులు నమ్ముతారు. ఇది మీ చేతులకు చిన్న వ్యాయామం లాంటిదట.

ప్రేమ
చేతులతో తినడమే కాకుండా ఇతరులకు తినిపించడం వల్ల ప్రేమ, ఆప్యాయత వంటివి పెరుగుతాయి. అమ్మ చేతి ముద్ద తిన్నప్పుడు వచ్చే ఆ అనుభూతి వర్ణించలేనిది. దీని వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య అనురాగం కూడా పెరుగుతుందట. అంతేకాకుండా తినిపించుకోవడం వల్ల మనుషుల దగ్గరవుతారని మానసిక నిపుణులు చెబుతున్నారు.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

 

 

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×