BigTV English

shamshabad crime : ప్రేమ వివాహం చేసుకున్న జంట.. 20 ఏళ్ల తర్వాత కోడలిని చంపేసిన అత్తామామలు..

shamshabad crime : ప్రేమ వివాహం చేసుకున్న జంట.. 20 ఏళ్ల తర్వాత కోడలిని చంపేసిన అత్తామామలు..

shamshabad crime : యువతీ, యువకులు ప్రేమ వివాహాలు చేసుకోవడం సాధారణమే. ఇంట్లో ఇష్టమైతే ఫర్వాలేదు. లేదంటే వారిని ఎదిరించి సైతం పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. అలాంటి వారిలో చాలా మందిని దూరం పెట్టే తల్లిదండ్రులు.. కొంత కాలానికి దగ్గరకు రానిచ్చే వాళ్లు కొందరైతే, జీవితాంతం దూరంగానే ఉంచే వాళ్లు మరికొందరు. కానీ.. ఏకంగా 20 ఏళ్ల తర్వాత ఆ ప్రేమ పెళ్లి ఇష్టం లేని తల్లిదండ్రులు హత్యకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పైగా.. కొడుకుని తమ నుంచి దూరం చేసింది అంటూ.. కోడలిని చంపేశారు. మూడు నెలల క్రితం హత్య జరగగా, ఇప్పుడు.. పోలీసులు మృత దేహాన్ని గుర్తించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలం రామాంజపూర్ తండాకు చెందిన దూలి (38), అదే తండాకు చెందిన మూడావత్ సురేష్ (డ్రైవర్) అనే యువతీ యువకులు… దాదాపు 20 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారి వివాహం సమయంలో ఇరు పక్షాల తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. అయినా వినకుండా ఇంట్లో వారిని ఎదిరింది పెళ్లి చేసుకున్నారు. వారికిప్పుడు ఇద్దరు పిల్లలున్నారు. తమ కొడుకుని తమ నుంచి దూరం చేసిందని కోడలిపై పగ పెంచుకున్న సురేష్ తల్లిదండ్రులు.. తులసి, అనంతి దంపతులు ఏకంగా 20 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నారు. దీంతో.. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

సురేష్, దూలి దంపతులు వేరుగా కాపురం ఉంటూ ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చారు. వారి జీవనం వారే గడుపుతున్నారు. డ్రైవర్ గా పనిచేస్తున్న సురేష్.. ఇటీవల మధ్యానికి బానిసయ్యాడు. నిత్యం మందు తాగి వచ్చి ఇంట్లో గొడవలు చేస్తున్నాడు. ఈ విషయమై.. ఇటీవల భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనేక సార్లు గొడవలు కూడా జరగడంతో  పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి సర్ది చెప్పారు. అయినా.. సురేష్ పద్ధతి మారకపోవడంతో తమ వద్దకు రావాలని కోడలిని నమ్మించి తీసుకెళ్లారు. కొన్నాళ్లుగా… అత్తగారింట్లోనే ఉంటూ పనులు చేసుంటున్న దూలీ.. తిరిగి తన భర్త దగ్గరకు వెళ్తానంది. ఆమెను బస్సు ఎక్కిచ్చి వస్తానని చెప్పి వెళ్లిన అత్త.. సాయంత్రానికి తిరిగి వచ్చింది. కానీ.. కొడలు మాత్రం ఇంటికి చేరలేదు.


ఆమె ఆచూకీ లభించడం లేదని మూడు నెలల క్రితం నవంబర్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్న పోలీసులు.. ఈ కేసును ఛేదించారు. పోలీసుల దర్యాప్తులో.. అత్తామామలే కోడలిని హత్య చేసినట్లుగా తేల్చారు. గతేడాది నవంబరులో ఆమెను సాతంరాయికి తీసుకెళ్లిన అత్త తులసి.. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఎలుకలు మందు కలిపిన కల్లును తాగించింది. అప్పటికే.. అక్కడ ఉన్న సోదరుడు హనుమ, భర్త అనంతితో కలిసి తలపై బండ రాళ్లతో మోది చంపేశారు.

20 ఏళ్ల తర్వాత కోడలిని హత్య చేసిన అత్తామామలు.. మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఇంటికి వెళ్లారు. భార్య కనిపించకపోవడంతో కంగారు పడిన సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ హత్య గురించి ఇటీవల వీరు మాట్లాడుకుంటుండగా చాటుగా విన్న పిల్లలు విషయాన్ని వారి మేనమామకు చేరవేయడంతో.. పోలీసులను సంప్రదించారు. దాంతో.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కోడలిని హత్య చేసినట్లు అంగీకరించారు.

కోడలు దూలిని హత్య చేసి సాతంరాయి వద్దనున్న త్రిలోక్ డెవలప్​మెంట్ ప్రాజెక్టు నిర్మాణాల దగ్గర పూడ్చిపెట్టినట్టు నిందితులు తెలపడంతో.. అక్కడి చేరుకున్న పోలీసులు తవ్వకాలు మొదలుపెట్టారు. రాజేంద్రనగర్ తహసీల్దార్, ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల సమక్షంలో ఉదయం నుంచి నిందితులు చూపిన స్థలాల్లో మూడు జేసీబీల సాయంతో తవ్వకాలు జరిపారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా పెద్ద ఎత్తున మట్టితో పూడ్చడంతో.. 12 -15 అడుగుల లోపన కుల్లిపోయిన స్థితిలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడే తహసీల్దార్ సమక్షంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.

Tags

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×