Roof Collapse: బీహార్ రాష్ట్రంలోని సరన్ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. మానస్ గ్రామంలో ఓ పాత ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండటం స్థానికులను కలిచివేసింది. వర్షాల కారణంగా పైకప్పు బలహీనపడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
సమాచారం తెలుసుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం వాటిని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
Also Read: భార్యను చంపి ఇనుప డబ్బాలో వేసి కాల్చి.. ఆమె ఫోన్ నుంచి ఐ లవ్ యూ మేసెజ్, ఆ తర్వాత నటన మొదలు
గత కొన్ని రోజులుగా బీహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పైగా ఆ ఇల్లు 30 సంవత్సరాల క్రితంది కావడంతో ఇల్లు కూలిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే కుటుంబంలో ఐదుగురు ప్రాణాలుకోల్పోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.