Vikarabad district: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శంకర్ అనే వ్యక్తి అకిమ్ పై కత్తితో దారుణంగా నడి రోడ్డుపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు..
అయితే పూర్తి వివరాల్లోకి వెళితే బాధితుడు అకిమ్, నిందితుడు శంకర్ మధ్య గత కొంతకాలంగా పాత కక్షలు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.. ఇప్పుడు ఆ వ్యక్తిగత గొడవలే ఈ దాడికి దారితీశాయని ప్రాథమిక సమాచారం. అయితే ఘటన జరిగిన రోజున వీరిద్దరి మధ్య మాట మాట పెరిగి, అది తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
ఆవేశంతో ఊగిపోయిన శంకర్, తన వెంట తెచ్చుకున్న కత్తితో అకిమ్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ హఠాత్ పరిణామంతో అకిమ్ తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో ఉన్న అకిమ్‌ను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అకిమ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పూడూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు శంకర్‌పై కేసు నమోదు చేసి, అతను పరారీలో ఉంటే పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. పాదచారిపైకి దూసుకెళ్లిన వాహనం.. వీడియో వైరల్..
అసలు శంకర్ ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు.. పాత కక్ష్యలే కారణమా..? లేదంటే మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. గ్రామంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా ఉంచారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కత్తితో దాడి.. లైవ్ లైవ్ అటాకింగ్ విజువల్స్
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లిలో అకిమ్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన శంకర్ అనే వ్యక్తి pic.twitter.com/C5dJhZCpHk
— BIG TV Breaking News (@bigtvtelugu) December 31, 2025