BigTV English

TDP Worker Murder: వైసీపీ అరాచకం.. కర్నూల్ జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య!

TDP Worker Murder: వైసీపీ అరాచకం.. కర్నూల్ జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య!

YSRCP Workers Killed TDP Worker in Kurnool: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ.. టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతోంది. ఓటమిని అంగీకరించలేని వైసీపీ కార్యకర్తలు.. ఇప్పటికీ టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ అధికారం చేపట్టబోతున్నా.. వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట పడలేదు. తాజాగా కర్నూల్ జిల్లాలో ఒక టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు.


వైసీపీ ఘోర పరాజయం పాలవ్వగా.. టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న కోపంతో.. పార్టీ కార్యకర్తను కొడవళ్లతో నరికి హతమార్చారు. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో ఈ విషాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించారు. మృతుడిని టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని మార్చురీకి తరలించారు.

Also Read: Sonakshi Sinha: తనకంటే రెండేళ్ల చిన్నవాడైన ప్రియుడితో స్టార్ హీరోయిన్ పెళ్ళి.. ఎప్పుడు, ఎక్కడంటే?


ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బొమ్మిరెడ్డి పల్లిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహానికి గురయ్యారు. గిరిని హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. మరోవైపు ఈ హత్య ఘటనను టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి ఖండించారు. అధికారాన్ని కోల్పోయినా.. వైసీపీ ఇలాంటి దారుణాలకు పాల్పడటం పై అసహనం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags

Related News

Faridabad News: ఏసీ పేలి ముగ్గురు మృతి.. బాల్కనీ నుంచి దూకేసి ప్రాణం కాపాడుకున్న యువకుడు

Nuzvid IIIT: దారుణం.. ఎగ్జామ్ రాయనివ్వలేదని ప్రొఫెసర్‌పై కత్తితో దాడి.. చివరకు?

Vishaka News: విశాఖలో రెచ్చిపోయిన కీచకులు.. మూగ బాలికపై అత్యాచారం!

Bhopal News: అంతా మిడ్‌ నైట్ తతంగం.. భర్తను లేపేసిన మూడో భార్య, షాకైన రెండో వైఫ్

Kolkata Crime: బర్త్ డే చేస్తామని పిలిచి.. డోర్ లాక్ చేసి.. కోల్ కతాలో యువతిపై..

UP News: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై డెలివరీ, బేబీ పుట్టిన గంటకే

Big Stories

×