BigTV English
Advertisement

Branded Liquor Sales in AP: నాన్ బ్రాండెడ్ లిక్కర్‌కు బ్రేక్.. ఏపీ గోడౌన్లకి కింగ్ ఫిషర్ బీర్లు!

Branded Liquor Sales in AP: నాన్ బ్రాండెడ్ లిక్కర్‌కు బ్రేక్.. ఏపీ గోడౌన్లకి కింగ్ ఫిషర్ బీర్లు!

Branded Liquor Sales Start Soon in AP: ఆంధ్రప్రదేశ్‌లో రేపో మాపో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎప్పుడు కొత్త ప్రభుత్వం వస్తుందాని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు మందుబాబులు. గడిచిన ఐదేళ్లుగా బ్రాండెడ్ లిక్కర్ ఏపీలో దొరకని పరిస్థితి. టీడీపీ సర్కార్ రావడంతో దేశంలోని పాపులర్ బ్రాండ్స్ అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో నాన్ బ్రాండెడ్ లిక్కర్ శకానికి తెరపడింది. ఐదేళ్లుపాటు బూమ్ బూమ్ అంటూ రకరకాల నాన్ బ్రాండెడ్ లిక్కర్ ఏపీ అంతటా అమ్మకాలు సాగాయి. ప్రభుత్వం మారింది.. నాన్ బ్రాండెడ్ లిక్కర్‌ను తొలగించి బ్రాండెడ్ లిక్కర్‌ను తీసుకురావాలనే ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పేరు పొందిన కింగ్ ఫిషర్ బీర్లను కంటెయినర్లలో తీసుకొచ్చి గొడౌన్లలో నిల్వ చేస్తున్నారు.

దీనికి సంబంధించి వీడియోను టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ట్వీట్ చేశారు. ఏపీకి కింగ్ ఫిషర్ తిరిగి వచ్చేసింది చీర్స్ అంటూ ప్రస్తావించారు. వైసీపీ అధికారంలోకి రాగానే బ్రాండెడ్ మద్యం అమ్మకాలను నిలిపివేసింది. గుర్తింపు లేని రకరకాల మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల ద్వారా విక్రయించింది. ఇది పెద్ద స్కాం అంటూ తొలి నుంచి టీడీపీ ఆరోపిస్తోంది.


Also Read: ఏపీ నేతలకు బీజేపీ హైకమాండ్ షాక్, ఇప్పుడేం చేద్దాం..

ప్రస్తుతం లిక్కర్ స్కామ్‌లో ప్రధాన పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ‌రెడ్డి కార్యాలయం ఇళ్ల‌లో సీఐడీ అధికారులు సోదాలు కంటిన్యూ చేస్తోంది. ఆయనతోపాటు అందులో కీలకంగా మారిన మరో ముగ్గురు వ్యక్తుల ఇళ్లు, ఆఫీసులపై సోదాలు కంటిన్యూ చేస్తోంది. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. కంప్యూటర్లకు సంబంధించిన హార్డ్‌ డిస్క్‌లను సీజ్ చేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ దర్యాప్తు మొదలుపెట్టింది. రేపోమాపో మాజీ ఎండీని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీపై చర్చ జరుగుతోంది. అధికారంలోకి రాగానే మద్యం పాలసీని రద్దు చేసింది. దాన్ని రద్దు చేయాలని టీడీపీ సర్కార్ ఆలోచన చేస్తోంది. డిస్టలరీస్ లైసెన్సులను రద్దు చేసి కొత్త పాలసీని తీసుకొస్తారని అంటున్నారు.

Also Read: Chandrababu about AP Capital : మన రాజధాని అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ : చంద్రబాబు

ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3500 మద్యం షాపులకు టెండర్ విధానం ద్వారా కేటాయింపులు చేయాలని ప్లాన్ చేస్తోంది. డిపాజిట్ సొమ్ము తిరిగి ఇవ్వకుండా రూరల్, అర్బన్ ఏరియాలుగా విభజన చేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 45 వేలు, అర్బన్ ఏరియాలో 55 వేలు డిపాజిట్ నిర్ణయించే విధంగా కసరత్తు చేస్తోందని సమాచారం.

Tags

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×