BigTV English

Sonakshi Sinha Marriage: తనకంటే రెండేళ్ల చిన్నవాడైన ప్రియుడితో స్టార్ హీరోయిన్ పెళ్ళి.. ఎప్పుడు, ఎక్కడంటే..?

Sonakshi Sinha Marriage: తనకంటే రెండేళ్ల చిన్నవాడైన ప్రియుడితో స్టార్ హీరోయిన్ పెళ్ళి.. ఎప్పుడు, ఎక్కడంటే..?

Actress Sonakshi Sinha will Marry Her Boyfriend Zaheer Iqbal : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సినిమా చేసే టైంలో పరిచయం ఏర్పడటం.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకురావడం ఈ మధ్య సెలెబ్రిటీలకు ఈజీ అయిపోయింది. అయితే ఇప్పటికే ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరొక ప్రేమ జంట పెళ్లికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా త్వరలో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహమాడనుంది.


37 ఏళ్ల సోనాక్షి సిన్హా.. 35 ఏళ్ల జహీర్ ఇక్బాల్‌ మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ జంట గత కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. ఏన్నో ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం రావడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం.. సోనాక్షి సిన్హా ఈ ఏడాదిలోనే జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 23 అంటే ఈ నెలలోనే ముంబైలో సోనాక్షి – ఇక్బాల్ పెళ్లి అత్యంత వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల సమక్షంలో వివాహ చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి పెళ్లి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇకపోతే సోనాక్షి సిన్హా శత్రుఘ్న సిన్హా కుతురిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది.


Also Read: ఆ హీరోయిన్ తో ఇంటిమేట్ సీన్స్ భయమేసింది.. ఆమె తల్లి ఎంకరేజ్ చేసి మరీ చేయించింది

తన మొదటి సినిమాగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ‘దబాంగ్’ సినిమాలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందం, యాక్టింగ్‌తో సినీ ప్రియుల్ని కట్టి పడేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పంచింది. అలాగే కోలీవుడ్‌లోను కొన్ని సినిమాల్లో నటించింది. ఇటీవలే స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో రూపొందిన ‘హీరమండి’లో నటించిన సోనాక్షి తన నటనతో అదరగొట్టేసింది. మొత్తంగా సినిమా పరంగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తాను కోరుకునే ప్రియుడితో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతుంది.

Tags

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×