BigTV English

Suzuki Access 125 @ Rs 10,000: చిన్న ఉద్యోగస్తుల కోసమే ఈ ఆఫర్.. రూ. 10,000 లకే కొత్త స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్ళండి

Suzuki Access 125 @ Rs 10,000: చిన్న ఉద్యోగస్తుల కోసమే ఈ ఆఫర్.. రూ. 10,000 లకే కొత్త స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్ళండి

Suzuki Access 125 Scooter buy at Rs.10,000 Down Payment: ప్రస్తుత కాలంలో ప్రతి వ్యక్తికి ద్విచక్ర వాహనం ఒక అవసరంగా మారిపోయింది. ముఖ్యంగా పట్టణాల్లో నివసించే వారు రోజువారీ తమ పిల్లలను స్కూల్‌కి డ్రాప్ చేయడానికి, అలాగే ఇంటి అవసరాల కోసం టూ వీలర్‌ను ఉపయోగిస్తుంటారు. అందులోనూ స్కూటీనే ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ అనేది ప్రధాన సమస్య అందువల్ల గేర్ల బైక్‌ల కంటే స్కూటీలే ఉత్తంగా పనిచేస్తాయి. కావును మీరు కూడా కొత్త స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ‘సుజుకి యాక్సెస్ 125’ (Suzuki Access 125) స్కూటర్ మంచి ఎంపికగా ఉంటుంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి ఇదే మంచి ఛాన్స్. ఎందుకంటే ఇప్పుడు అతి తక్కువ ధరలో కొనుక్కోని ఇంటికి పట్టుకెళ్లొచ్చు. అదెలాగో తెలుసుకుందాం..


కొత్త Suzuki Access 125 వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఢిల్లీలో దాని ‘రైడ్ కనెక్ట్ ఎడిషన్ – డిస్క్’ మోడల్ ఆన్-రోడ్ ధర రూ.1,09,216గా ఉంది. మీరు రూ.10,000 డౌన్ పేమెంట్‌తో ఈ స్కూటర్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. అప్పుడు మీరు 9.7 శాతం వడ్డీ రేటుతో మూడేళ్లపాటు రూ.3,187 EMI చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే సుజుకి యాక్సెస్ 125 ‘స్పెషల్ ఎడిషన్ – డిస్క్’ వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 1,05,092గా నిర్ణయించబడింది. మీరు ఈ స్కూటర్‌ను రూ. 10,000 డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 9.7 శాతం వడ్డీతో 3 సంవత్సరాల పాటు నెలకు రూ.3,055 EMI చెల్లించాల్సి ఉంటుంది.


Also Read: ఈ ఏడాది రానున్న బెస్ట్ స్కూటర్ల లిస్టు.. తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు

యాక్సెస్ 125 ‘డిస్క్’ మోడల్ ఆన్-రోడ్ ధర రూ. 1,02,714గా ఉంది. మీరు రూ.10,000 డౌన్ పేమెంట్ చేసి ఈ స్కూటర్‌ను కొనుగోలు చేస్తే.. 9.7 శాతం వడ్డీ రేటుతో మూడు సంవత్సరాల కాలానికి నెలవారీ రూ.2,979 EMI చెల్లించాలి.

సుజుకి యాక్సెస్ 125 ‘డ్రమ్’ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ.97,137గా కంపెనీ నిర్ణయించింది. మీరు ఈ స్కూటర్‌ను రూ.10,000 డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేస్తే.. 9.7 శాతం వడ్డీ రేటుతో 3 సంవత్సరాల పాటు నెలకు రూ.2,799 EMI చెల్లించాలి. అందువల్ల ఎప్పట్నుంచో మంచి ఫీచర్లు కలిగిన కొత్త స్కూటర్‌ను అతి తక్కువ ధరలో కొనుక్కోవాలని చూస్తున్న చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఇది మంచి ఛాన్స్. ఎందుకంటే ఒకేసారి అమౌంట్ పే చేసి కొనుక్కోవాలంటే చాలా మందికి కష్టంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు రూ.10 వేల డౌన్‌పేమెంట్‌ చేసి నెల నెల తక్కువ మొత్తంలో కట్టుకునే అవకాశం లభించింది.

ఈ కొత్త సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌లో 124 సిసి సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడింది. ఈ ఇంజన్ గరిష్టంగా 8.7 PS పవర్, 10 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 45 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. భద్రత కోసం.. ఇది డిస్క్/డ్రమ్ బ్రేక్ ఎంపికను కలిగి ఉంది.

Also Read: అధిక మైలేజీ అందించే బజాజ్ చేతక్ 2901 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు అదుర్స్!

యాక్సెస్ 125 మోడల్ LED హెడ్ లైట్, సెమీ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్, సుజుకి రైడ్ కనెక్ట్ వంటి అనేక ఫీచర్లతో వస్తుంది. ఇది ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంది. దీని బరువు 103 కిలోలు. భారత మార్కెట్లో సుజుకి యాక్సెస్ 125.. హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125 వంటి మోడళ్లతో పోటీపడుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ఆన్-రోడ్ ధర, లోన్ ఆప్షన్‌లు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారే అవకాశం ఉంది.

Tags

Related News

BSNL Offers: జియో, ఎయిర్‌టెల్ ప్లాన్‌లకు షాక్.. BSNL రూ.485లో 72 రోజుల మాస్ ఆఫర్

Jio Offers: 3 నెలల ప్యాక్ ఇంత చౌకా? జియో వినియోగదారులకి గుడ్ న్యూస్

Amazon Prime 2025: అమెజాన్ ప్రైమ్ ఫెస్టివల్ డీల్.. రూ.399 నుండి రూ.1499 వరకు డిస్కౌంట్లు, ఏది బెస్ట్?

TVS Bikes Price Cut: బైక్స్, స్కూటర్ల ధరలు తగ్గించిన టీవీఎస్.. కొత్త ధరల లిస్ట్ ఇదే!

OTP: ఓటీపీలకు కాలం చెల్లింది.. ఇకపై కొత్త తరహా డిజిటల్ చెల్లింపులు!

Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇప్పట్లో ఆగేలా లేదుగా..!

Deceased Account Settlement: చనిపోయిన వ్యక్తుల బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు.. వారసులు ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసా?

BSNL 4G Launch: జియో, ఎయిర్టెల్‌కు పోటీగా బీఎస్ఎన్ఎల్ 4జీ.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Big Stories

×