E-Paper
Advertisement

Hyderabad City: యాప్ పేరుతో మోసం.. ఫాల్కన్ గ్రూప్ మాజీ సీఓఓ అరెస్ట్.. ఏకంగా రూ.792 కోట్లు

Hyderabad City: యాప్ పేరుతో మోసం.. ఫాల్కన్ గ్రూప్ మాజీ సీఓఓ అరెస్ట్.. ఏకంగా రూ.792 కోట్లు
Advertisement

Hyderabad City: ఫాల్కన్ ఫోంజీ స్కామ్‌ కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేసింది సీఐడీ. ఫాల్కన్ గ్రూప్ మాజీ సీఓఓ వికాస్ కుమార్ సఖారే అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన A-27 నిందితుడిగా ఉన్నాడు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యాప్ పేరుతో దేశవ్యాప్తంగా మోసం వెలుగులోకి వచ్చింది.

ఫాల్కన్ గ్రూప్ మాజీ సీఓఓ వికాస్ కుమార్ అరెస్ట్

Advertisement

ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అప్లికేషన్ పేరుతో మోసాలకు పాల్పడింది ఆ గ్రూపు. ఈ కేసులో A-27 నిందితుడు ఫాల్కన్ గ్రూప్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వికాస్ కుమార్‌ను బుధవారం అరెస్ట్ చేసింది సీఐడీ. మొత్తం 7,056 మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ. 4,215 కోట్లు వసూలు చేసింది. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా డిపాజిట్ల సేకరించారు.

గూగుల్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భారీ ప్రచారం చేశారు. ప్రముఖ ఎంఎన్‌సీల పేర్లతో నకిలీ డీల్స్ సృష్టించారు నిందితులు అధిక వడ్డీ హామీతో పెట్టుబడిదారులను ఆకర్షించినట్లు తెలుస్తోంది. డిపాజిటర్లకు నకిలీ ఇన్వాయిస్ రసీదులు, ఒప్పందాలతో మోసం చేసినట్టు గుర్తించారు. 4,065 మంది బాధితులను మోసం చేసింది ఆ సంస్థ.

Advertisement

యాప్ పేరుతో మోసం.. ఏకంగా రూ.792 కోట్లు మింగేశారు

రూ. 792 కోట్ల మేర మోసం చేసిందని వెల్లడించారు అధికారులు. తొలుత సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో కేసు నమోదు అయ్యింది. ఆ తర్వాత సీఐడీకి బదిలీ అయ్యింది. దర్యాప్తు మొదలుపెట్టిన సీఐడీ, వికాస్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఫాల్కన్ సంస్థ డైరెక్టర్లపై దేశవ్యాప్తంగా దాదాపు 10 కేసులు నమోదయ్యాయి.

ఫాల్కన్ గ్రూప్ సీవోవోగా వికాస్ కుమార్ సఖారే, ఆ సంస్థ ఎండీ అమర్‌దీప్ కుమార్, యోగేంద్ర సింగ్‌లతో కలిసి డిపాజిటర్లను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో అతడ్ని హైదరాబాద్‌ సిటీలోని హైదర్షాకోట్‌లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచాయి. అతడికి జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు.

ALSO READ:  తిరుమల ఘాట్ రోడ్డులో బైక్ యాక్సిడెంట్.. స్పాట్ ఒకరు మృతి

నిందితుడి నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు తదుపరి దర్యాప్తు జరుగుతోందని సీఐడీ ఏడీజీపీ చారుసిన్హా తెలిపారు. ఇలాంటి హామీ ఇచ్చే ఆన్‌లైన్ పెట్టుబడి పథకాలకు ప్రజలు మోసపోవద్దని సీఐడీ తెలిపింది. పెట్టుబడిదారులు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడిలో పెట్టే ముందు వారి వారి ఆధారాలను ధృవీకరించుకోవాలని సూచన చేసింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×