E-Paper
Advertisement

Gandhi Hospital IVF: సర్కారీ ఆసుపత్రుల్లో సంతాన భరోసా.. నమ్మకంతో క్యూకడుతున్న జనం

Gandhi Hospital IVF: సర్కారీ ఆసుపత్రుల్లో సంతాన భరోసా.. నమ్మకంతో క్యూకడుతున్న జనం
Advertisement

Gandhi Hospital IVF: స్వేచ్ఛ బ్యూరో: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కు చెందిన శ్రుతి శ్రీకాంత్ దంపతులు పిల్లల కోసం ఏడేళ్లుగా వివిధ ప్రైవేట్ ఫర్టిలిటీకేంద్రాలను ఆశ్రయించారు. చాలా సార్లు ఐయూఐ,ఐవీఎఫ్​ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. కానీ ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో చివరి ప్రయత్నంగా గాంధీ ఆసుపత్రిని విజిట్ చేశారు. ఐవీఎఫ్​ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలను కనాలనే కలను నెరవేర్చుకున్నారు. బేబీ గర్ల్స్ పుట్టడంతో ఆ కుటుంబంలో సంతోషాలు వెల్లువెత్తాయి. బేబీ, మధర్ ను పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తూ ట్రీట్మెంట్ అందించి బుధవారం డిశ్చార్జ్ చేశారు. ” ఎన్నో ఏళ్ల కలను నిజం చేసినందుకు ప్రభుత్వ వైద్యులకు ఆ ఫ్యామిలీ కృతజ్ఞతలు తెలిపింది. ఇలా చాలా ఫ్యామిలీలు ఇప్పుడు సర్కారీ దవాఖానలకు ప్రెగ్రెన్సీ కోసం పరుగులు పెడుతున్నారు.

గాంధీ ఆసుపత్రిలో జనం క్యూ..

సర్కార్ ఐవీఎఫ్​ సెంటర్లకు డిమాండ్ పెరిగింది. గాంధీ, పేట్ల బురుజులోని ఎక్స్ క్లూజీవ్ ఐవీఎఫ్​ సెంటర్లకు బాధితులు భారీగా వస్తున్నారు. ప్రైవేట్ కేంద్రాల కంటే అత్యధికంగా వస్తున్నట్లు ఆయా ఆసుపత్రి అధికారులు చెప్తున్నారు. గడిచిన ఏడాదిన్నరలో గాంధీ ఆసుపత్రికి దాదాపు 10,272 మంది బాధితులు చికిత్స నిమిత్తం వచ్చారు. వీరిలో కొత్తగా 3637 ఓపీ ద్వారా రాగా, 6635 మంది రివ్యూ లో భాగంగా కేంద్రాన్ని ఆశ్రయించారు. ఇతర ఆసుపత్రుల్లో అన్ని ప్రయత్నాలు చేసి గాంధీ లో ట్రీట్మెంట్ కోసం వచ్చారు. ఇక పేట్ల బురుజు దవాఖానకు ఏకంగా 17,100 మంది ట్రీట్మెంట్ కోసం రాగా, ఇందులో 12,378 మంది ఇతర ఆసుపత్రుల్లో చెకప్ లు తర్వాత ఇక్కడికి వచ్చారు. ఈ కేంద్రంలో కొత్తగా 4722 మంది నేరుగా చికిత్స కొరకు వచ్చినట్లు అధికారులు ఆఫీసర్లు వెల్లడించారు. అంటే డైరెక్ట్ ఓపీ కంటే, అప్పటికే ప్రయత్నాలు చేసి ఆలసిపోయిన పేషెంట్లే ఈ కేంద్రాలకు అత్యధికంగా రావడం గమనార్​హం. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు కేంద్రాల్లో ప్రత్యేకంగా ఎంబ్రాలజిస్టులు, అవసరమైన ఎక్విప్ మెంట్లు, రీయోజెంట్స్, మెడిసిన్స్ వంటివన్నీ సమకూర్చింది. ఆ తర్వాత ఈ కేంద్రాల పనితీరు స్పీడప్ అయ్యాయి.

Advertisement

Also Read: Mumbai Fruit Vendor: జర్రంతా భద్రం, పండ్ల రూపంలో పొంచి ఉన్న విషం.. వైరల్ అవుతున్నముంబై వీడియో

200 మందికి పాజిటివ్..

గాంధీ,పేట్ల బురుజు కలిపి దాదాపు 27,372 మంది బాధితులు రాగా, వీరిలో 568 హెచ్ ఎస్ జీ ట్రీట్మెంట్ ఇచ్చారు. 14,033 మందికి పాలిక్యూలర్ ను పరిశీలించి 366 మందికి ఐయూఐ ట్రీట్మెంట్ ఇవ్వగా, 19 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక రెండు కేంద్రాలు కలిపి 4458 మందికి సెమెన్ అనాలసిస్ (వీర్య పరీక్షలు )చేయగా, ఇందులో 366 మందికి స్విప్ అప్ టెక్నిక్ ట్రీట్మెంట్ అందజేశారు. 416 మందికి ఐవీఎఫ్​ చికిత్స అందించారు. వేల మంది పేషెంట్లు ట్రీట్మెంట్ లో భాగంగా సెషన్స్ ను పూర్తి చేసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు గాంధీ ఆసుపత్రిలో ఐయూఐ, ఐయూఎఫ్​ తో పాటు మరి కొన్ని చికిత్స విధానాల ద్వారా 65 మంది కి పాజిటివ్ రాగా, పేబ్ల బురుజులో 125 మందికి పిల్లలుపొంతే అదృష్టం వరించింది.

లక్షల రూపాయల భారం తగ్గింది..

Advertisement

సంతానలేమితో బాధపడుతున్న పేద మధ్యతరగతి దంపతులకు ప్రభుత్వ వైద్యం వరప్రసాదంగా మారుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు వెచ్చించినా దక్కని ఫలితం, ఇప్పుడు సర్కారు దవాఖానాల్లో అతి తక్కువ ఖర్చుతో లేదా ఉచితంగా అందుతుండటం గమనార్హం. ఎంతో మంది పేదలకు ఈ కేంద్రాలు ఆర్ధిక భారం నుంచి తప్పిస్తున్నాయి. గాంధీ ఆసుపత్రి ,పెట్లబుర్జు ఆసుపత్రుల్లో ప్రారంభమైన ఐవీఎఫ్ సెంటర్లు అద్భుతమైన ఫలితాలను నమోదు చేస్తున్నాయి.సంతానోత్పత్తి ప్రక్రియలో కీలకమైన వివిధ పరీక్షలు,చికిత్సల్లో ప్రభుత్వ వైద్యులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక సాంకేతికతతో ప్రభుత్వ ఆసుపత్రులు సేవలందిస్తున్నాయి. కేవలం మందులకే కాకుండా, ఐవీఎఫ్ వంటి ఖరీదైన చికిత్సలను కూడా పేదలకు అందుబాటులోకి తీసుకురావడం వల్ల అనేక కుటుంబాల్లో సంతాన సాఫల్యత కలుగుతోంది. జిల్లా స్థాయిలోనూ ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు అవసరమనే డిమాండ్ పబ్లిక్ నుంచి వస్తున్నది.

Also Read: Sports Drama OTT: ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్ ఇచ్చే శిష్యుడు… గురువు అంతకు మించి… టాప్ లేపుతున్న స్పోర్ట్స్ డ్రామా

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×