E-Paper
Advertisement

Medak plane crash: కూలిన విమానం.. ఇద్దరు పైలట్లు మృతి

Medak plane crash: కూలిన విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
latest news in telangana

Medak plane crash news(Latest news in telangana) :

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి శివారులో దుండిగల్ విమానాశ్రయం కు సంబంధించిన శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటన సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో జరిగింది. కూలిన విమానం పూర్తిగా కాలిపోవడంతో.. అందులో ఉన్న ఇద్దరు పైలట్లు మరణించారని పోలీసులు వెల్లడించారు.

తూప్రాన్ సమీపంలోని రావెల్లి కొండల్లో శిక్షణ విమానం కూలిపోయింది. ఆ సమయంలో పెద్ద శబ్ధం రావడంతో సమీపంలో పనిచేస్తున్న రైతులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే విమానం పూర్తిగా కాలిపోవడంతో.. స్థానికులు మంటలను ఆర్పేందుకు ముందుకు వెళ్లలేకపోయారు.

కాగా.. హెలికాప్టర్ లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానాన్ని దుండిగల్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన శిక్షణ విమానంగా పోలీసులు గుర్తించారు. సాంకేతిక లోపం కారణంగానే శిక్షణ విమానం కూలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Tags

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×