BigTV English

Tirupati Crime: తిరుపతిలో దారుణం.. మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం!

Tirupati Crime: తిరుపతిలో దారుణం.. మూడున్నరేళ్ల  చిన్నారిపై అత్యాచారం!

Tirupati Crime: తెలుగు రాష్ట్రాల్లో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు విధించినా.. మహిళలు, చిన్నారులుపై మాత్రం అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదు. నిత్యం ఏదొక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతిలో దారుణం చొటుచేసుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారిపై ఆత్యాచారం జరిగింది.


వివరాల్లోకి వెళ్తే.. వడమాల పేట మండలం ఏ.ఎం పురం ఎస్టీ కాలనీకి చెందిన మూడన్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. హత్య చేశాడో కిరాతకుడు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సుశాంత్ అనే యువకుడు.. చాకెట్లు ఇస్తానని ఆశచూపి చిన్నారిపై లైంగిక దాడి చేసి.. ఆ తర్వాత చంపేసి పూడ్చి పెట్టాడు. అయితే పొద్దుపోయిన చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానితుడైన సుశాంత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు బాలిక శవమును గుర్తించిన పోలీసులు, పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి మార్చురీకి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి హత్యతో ఆగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లి దండ్రులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.


Also Read:  కాళ్లు మొక్కి కాల్చింది ఎవరో తెలిసింది.. షాక్ లో కుటుంబ సభ్యులు.

ఈ నేపథ్యంలో చిన్నారి హత్యపై మాజీ మంత్రి రోజా తీవ్రంగా స్పందించచారు. ఇంతటి ఘాతకానికి పాల్పడిన నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని మండిపడ్డారు. ఐదు నెలల్లో మహిళలకు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగాయి. వారి భద్రతా గాలిలో దీపంలా మారిందని మాజీ మంత్రి  రోజా ఆందోళన వ్యక్తం చేశారు.

తాజాగా ఏపీలో మరో ఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో దారుణం జరిగింది. మహిళను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు. మృతదేహాన్ని కాలువలో పడేశారు. ముఖం గుర్తుపట్టకుండా హత్య తర్వాత మహిళకు గుండు కొట్టారు. ఈ నెల 15న జరిగిన ఘటన జరగ్గా.. 17న కాలువలో మృతదేహం దొరికింది. నిందితులు నలుగురు నర్సరీల్లో పనిచేసేవారే అని పోలీసులు గుర్తించారు. గంజాయి మత్తులో అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది.

 

Related News

Instagram love: ప్రియురాలిని చంపి.. సూట్‌కేస్‌లో బాడీని కుక్కి.. సెల్పీ తీసుకున్న ప్రియుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Heart Attack: పుట్టినరోజు నాడే చావు.. బతుకమ్మ ఆడుతూ కుప్పకూలి మహిళ

Guntur: నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్.. లేడీస్ హాస్టల్‌లో యువతి అనుమానస్పద మృతి

Medipally Incident: దారుణం.. సీనియర్ల వేధింపులకు బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Gas Cylinder Blast: ఒకేసారి పేలిన గ్యాస్ సిలెండర్, వాషింగ్ మిషన్.. ముగ్గురికి తీవ్రగాయాలు

Son Kills Parents: పిఠాపురంలో దారుణం.. ఇద్దరిని చంపేసి.. బావిలో తోసి ఎందుకు చంపాడంటే!

Visakhapatnam Youth Suicide: ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Big Stories

×