E-Paper
Advertisement

Sonipat Toll plaza: టోల్ ఫీజు అడిగినందుకు తల పగలగొట్టారు.. హర్యానాలో దారుణం, సీసీటీవీ కెమెరాల్లో అంతా

Sonipat Toll plaza: టోల్ ఫీజు అడిగినందుకు తల పగలగొట్టారు.. హర్యానాలో దారుణం, సీసీటీవీ కెమెరాల్లో అంతా
Advertisement

Sonipat Toll plaza: హర్యానాలోని సోనిపట్ వద్ద టోల్ ప్లాజాలో అర్ధరాత్రి కొందరు యవకులు వీరంగం సృష్టించారు. టోల్ ఫీజు చెల్లించాలని కోరినందుకు సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడికి తెగబడిన కొందరు యువకులు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అసలేం జరిగింది?

హర్యానాలో దారుణం.. టోల్ ప్లాజా వద్ద రెచ్చిపోయిన యువకులు

Advertisement

హర్యానాలోని జాతీయ రహదారి 44 నెంబర్‌లోని భిగాన్ టోల్ ఫ్లాజా వద్ద ఊహించని ఘటన చోటు చేసుకుంది. గురువారం అర్థరాత్రి SUV కారుల్లో ప్రయాణిస్తున్నారు కొందరు యువకులు. టోల్ ఫ్లాజా వద్ద యువకుల వాహనాలు చేరుకున్నాయి. టోల్‌కు సంబంధించి అందులోని ఉద్యోగులు వాహనదారుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేరుగా వాహనాల్లో నుంచి కిందికి దిగారు. ప్లాజా ఉద్యోగులపై కర్రలతో దాడి చేశారు. యువకులు వారిని వెంబడించి మరీ కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు CCTV కెమెరాల్లో రికార్డు అయ్యింది. నాలుగు వాహనాల్లో గ్రూప్‌కు చెందిన యువకులు టోల్ ప్లాజా వద్దకు చేరుకోవడం, ఆపై ఉద్యోగులను వెంబడించి కొట్టడం ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement

టోల్ ఫీజు అడిగినందుకు తల పగలగొట్టారు, ఆసుపత్రిలో బాధితులు

ఈ ఘటనపై టోల్ ప్లాజా మేనేజర్ నోరు విప్పారు. క్యూలో మూడు వాహనాల నుండి దాదాపు 10 నుంచి 12 మంది యువకులు బూమ్ బారియర్‌ని బలవంతంగా తొలగించి ముందుకు కదిలారు. ఆ సమయంలో ఉద్యోగులపై దాడి చేశారు. దాడిలో గాయపడిన ఇద్దరు టోల్ ఉద్యోగులు సోనిపట్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ప్లాన్ ప్రకారం ఈ దాడి జరిగిందని చెబుతున్నారు టోల్ ఫ్లాజా ఉద్యోగులు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. దాడి చేసినవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది.

ALSO READ: ప్రియురాలితో వీడియో కాల్‌.. బాలుడు సూసైడ్

నిందితులను గుర్తించడానికి పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఈ ఒక్క టోల్ ఫ్లాజా మాత్రమే కాదు.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో టోల్ ఉద్యోగులు రాత్రి వేళ డ్యూటీలు చేయడానికి భయపడుతున్నారు. తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×