E-Paper
Advertisement

Medchal Crime: ప్రియురాలితో వీడియో కాల్‌.. బాలుడు సూసైడ్, మేడిపల్లిలో దారుణం

Medchal Crime: ప్రియురాలితో వీడియో కాల్‌.. బాలుడు సూసైడ్, మేడిపల్లిలో దారుణం
Advertisement

Medchal Crime: మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో ఆందోళనకు గురైన ఆ యువతి, అతడి స్నేహితులకు సమాచారం ఇచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు.

మేడ్చల్ జిల్లాలో దారుణం.. బాలుడు ఆత్మహత్య

Advertisement

కారణాలు ఏమైనా కావచ్చు.. ఇటీవలి కాలంలో టీనేజ్ యువతీయువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. పేరెంట్స్ వైపు కావచ్చు.. లేకుంటే గాళ్ ఫ్రెండ్ వైపు కావచ్చు. ఇలా అనేక కారణాలు లేకపోలేదు. తాజాగా మేడ్చల్ జిల్లాలో అలాంటి ఘటన ఒకటి జరిగింది.

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యువకుడు.. ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. బోడుప్పల్‌ అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో బాలుడి ఫ్యామిలీ నివాసం ఉంటోంది. బాలుడి తండ్రి ఓ ప్రైవేటు ఆఫీసులో ఉద్యోగి చేస్తున్నాడు. అతడి కొడుకు స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు.

Advertisement

ప్రియురాలితో వీడియో కాల్‌.. ఆపై ఆత్మహత్య

మరోవైపు మేడిపల్లిలోని ఓ కార్ల షోరూమ్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఫిబ్రవరి ఐదున బాలుడి తల్లిదండ్రులు షాపింగ్ కోసం బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. తాను ప్రేమించిన అమ్మాయికి తన ఫోన్ నుంచి వీడియో కాల్ చేశాడు. ఆ తర్వాత ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతుండగానే చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.

షాకైన యువతి, వెంటనే అతడి స్నేహితులకు సమాచారం ఇచ్చింది. ఫ్రెండ్స్.. బాలుడి ఇంటికి చేరుకున్నారు. ఉరి వేసుకున్న బాలుడ్ని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఈ విషయం తెలియగానే తల్లిదండ్రులు ఎకాఏకీన ఆసుపత్రికి చేరుకున్నారు.

ALSO READ: ఆ హోటల్‌లో హిజ్రా రచ్చ.. బట్టలు విప్పేసి మరీ

మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బాలుడి ఫోన్ తీసుకుని వీడియో కాల్ ఎవరికి చేశాడు? ఎందుకు చేశాడు? ప్రేమ వ్యవహారం ఈ ఘటనకు కారణమా? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×