Karimnagar Girl Incident: జగిత్యాల జిల్లా కోరుట్ల చిన్నారి హత్యకేసును ఛేదించారు పోలీసులు. చిన్నారిని సొంత పిన్నె చంపినట్లు నిర్ధారణకు వచ్చారు. తోడికోడలుపై కక్ష పెంచుకున్న మమత చిన్నారిని దారుణంగా చంపేసింది.
కుటుంబ విభేదాలు.. ఓ చిన్నారి ప్రాణం పోయింది
కుటుంబ కలహాలతో తోడికోడలిపై పగ పెంచుకున్న మమత.. హితిక్షను పథకం ప్రకారం చంపేసింది. తన కూతుళ్లు, హితీక్షతో కలిపి ఆడుకుందామని చెప్పిన మమత.. ఆట ఆడుకునే క్రమంలో మమత కూతుర్లు పక్క ఇంట్లో దాక్కున్నారు. మృతురాలు హితీక్ష బాత్‌రూమ్‌లో దాక్కుంది. ఇదే అదునుగా బావించిన నిందితురాలు కత్తి, కట్టర్‌తో చిన్నారి గొంతులో పొడిచింది. దీంతో అక్కడికక్కడే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
హత్య తర్వాత నాటకం
హత్య అనంతరం ఏం తెలియనట్టు.. ఫ్యామిలితో కలిసిపోయి డెడ్‌బాడీ పక్కన కూర్చొని ఏడ్చింది. తనే ఈ దారుణానికి పాల్పడిందన్న భయం మాత్రం చూపించలేదు.
పోలీసుల క్లూస్ వర్క్
మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, హితీక్ష గొంతు దగ్గర గాయాలు, హత్యకు ఉపయోగించిన ఆయుధాల ఆధారంగా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, సీసీ కెమెరా దృశ్యాలు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా.. చివరకు మమతే ఈ హత్య చేసినట్లు తేలింది. పోలీసుల ముందు.. చివరకు మమత తన నేరాన్ని ఒప్పుకుంది. తోడికోడలపై కక్షతోనే ఈ హత్య చేశానని అంగీకరించింది.
తీవ్ర స్థాయిలో ఆవేదన
ఓ ఐదేళ్ల పసిప్రాణం ఇంటి అంతర్గత తగాదులకే.. బలవుతుందంటే ఎంత దారుణమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నారి హితీక్ష అమాయక చిరునవ్వు.. ఇక చూడలేమన్న బాధ ప్రతి ఒక్కరి మనసుని కలచివేస్తోంది.
తల్లిదండ్రుల కన్నీళ్లు
ఇంతమంది ఇంట్లో ఉన్నా.. మా కళ్ల ముందే బిడ్డను పోగొట్టుకున్నాం. మా ఇంట్లో వారే ఇలా చేస్తారనే అనుమానమే రాలేదు.. అస్సలు మేము ఊహించలేదు. అంటూ హితీక్ష తల్లిదండ్రులు విలపించారు. మమత చర్య పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: పెళ్లయ్యాక మరొకరితో లవ్.. చివరికి చెట్టుకి వేలాడుతూ.. దారుణం!
జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ సంఘటన.. కుటుంబ కలహాలు ఎంత ప్రాణాంతకంగా మారతాయో చాటిచెప్పింది. చిన్నారి హితీక్షను కిరాతకంగా హతమార్చిన మమతపై.. కఠిన శిక్ష అమలు చేయాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మనుషుల మధ్య అర్థం లేని ద్వేషాలు.. అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకోకుండా.. జాగ్రత్త పడాలని అందరూ సూచిస్తున్నారు.