Indian Navy: టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు, ముఖ్యమైన తేదీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇండియన్ నేవీలో గ్రూప్-బీ, గ్రూప్ -సీ విభాగాల్లో సివిల్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. జులై 18న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1110
ఇండియన్ నేవీలో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో స్టాఫ్ నర్సు, చార్జ్ మెన్, అసిస్టెంట్ ఆర్టిస్ట్ రీటచర్, ఫార్మసిస్ట్, కెమెరామెన్, ఫైర్ మెన్, స్టోర్ కీపర్, ట్రేడ్స్ మెన్ మేట్, డ్రాఫ్ట్ మెన్ తదితర పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 18
వయస్సు: స్టాఫ్ నర్సు ఉద్యోగానికి 45 ఏళ్ల వయస్సు మించరాదు. చార్జ్ మాన్ ఉద్యోగానికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఫార్మసిస్ట్, కెమెరామెన్ ఉద్యోగానికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ట్రేడ్స్ మెన్ర, ఫైర్ మెన్, స్టోర్ కీపర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: ఉద్యోగాన్ని బట్టతి వేతనాన్ని నిర్ణయించారు. గ్రూప్ బీ పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,42,400 జీతం ఉంటుంది. గ్రూప్ సీ ఉద్యోగాలకు రూ.18వేల నుంచి రూ.81,100 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్, స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
పరీక్ష విధానం: ఎగ్జామ్ లో జనరల్ ఇంటెలిజెన్స్, ఆవేర్ నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్, ఇంగ్లిష్ నుంచి క్వశ్చన్లు వస్తాయి.
దరఖాస్తు ఫీజు: రూ.295 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.joinindiannavy.gov.in
నోటిిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1110
దరఖాస్తుకు చివరి తేది: జులై 18