Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. రైతు బిడ్డ (Raithu Bidda)అంటూ ఎన్నో యూట్యూబ్ వీడియోలు చేస్తూ తనకు బిగ్ బాస్ అవకాశాలు కల్పించాలని కోరారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడమే తన లక్ష్యమని ఎలాగైనా తనని హౌస్ లోకి తీసుకోవాలి అంటూ యూట్యూబ్ వీడియోల ద్వారా తన కోరికను బయటపెట్టి బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Season 7) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా అవకాశం అందుకున్నారు. ఇక హౌస్ లో కూడా ఈయన వీలైన ప్రతిసారి తాను రైతుబిడ్డనని తనకు మద్దతు తెలపాలి అంటూ కొంతమేర సింపతి డ్రామాలు ప్లే చేశారు.
రైతుల కోసం బిగ్ బాస్ ప్రైజ్ మనీ..
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో కనుక పల్లవి ప్రశాంత్ విన్నర్(Winner) అయితే ఆ డబ్బుతో ఏం చేస్తావు అంటూ ప్రశ్న వేశారు. ఆ క్షణం పల్లవి ప్రశాంత్ తాను నిరుపేద రైతులకు వ్యవసాయ పనుల నిమిత్తం ఆ డబ్బులు పంచుతానని చెప్పడంతో ఈయన పట్ల ఎంతో మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇలా పల్లవి ప్రశాంత్ కు మద్దతు పెరగడంతో చివరికి ఈ కార్యక్రమంలో విన్నర్ గా బయటకు వచ్చారు. ఇక బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. సెలబ్రిటీ రేంజ్ లో ఆయన లైఫ్ స్టైల్ మారిపోయింది. బిగ్ బాస్ తర్వాత వ్యవసాయ పనులను దాదాపు పక్కన పెట్టి షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తూ బిజీ అయ్యారు
ప్రైజ్ మనీ పంచేసాను…
బిగ్ బాస్ నుంచి ఈయన పెద్ద ఎత్తున ప్రైజ్ మనీ (Prize Miney)గెల్చుకున్నప్పటికీ అందరికీ తెలిసేలా ఓ రెండు కుటుంబాలకు సహాయం చేశారు. ఇకపోతే పల్లవి ప్రశాంత్ మిగిలిన డబ్బు రైతులకు పంచుతున్నట్లు ఎక్కడ ఒక వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. బిగ్ బాస్ కార్యక్రమంలో గెలవడం కోసమే సింపతి డ్రామాలు ప్లే చేశారంటూ ఈయనపై తరుచూ విమర్శలు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు. నేను బిగ్ బాస్ లో గెలిచిన డబ్బులు సహాయం చేయలేదని ఎవరు చెప్పారు నేను గెలుచుకున్న డబ్బు మొత్తం సహాయం చేశానంటూ షాక్ ఇచ్చారు. అయితే సహాయం చేసిన సందర్భంలో తాను వీడియోలు చేయలేదని పల్లవి ప్రశాంత్ తెలిపారు. నేను కేవలం బిగ్ బాస్ డబ్బులు మాత్రమే కాదు ఒక షాప్ ఓపెనింగ్ కు వెళ్లిన ఇచ్చే డబ్బులు కొంత భాగం ఇతరుల కోసమే ఉపయోగిస్తున్నానని తెలిపారు.
వీడియోలు అందుకే తీయలేదు..
ఇకపోతే ఓ చెల్లికి తాను సహాయం చేసేటప్పుడు తాను నన్ను ఒకటే వేడుకంది. అన్న మీరు సహాయం చేస్తున్నారు సంతోషంగా ఉంది కానీ, మాకు సహాయం చేసినట్టు వీడియోలు చేయొద్దండి అని కోరారు అలా ఆ చెల్లి కోరిక మేరకే తాను వీడియోలు చేయలేదని ప్రశాంత్ చెప్పారు. తాను సహాయం చేసిన వారికి ఫోన్లు చేస్తే కచ్చితంగా నేను సహాయం చేసినట్టు చెబుతారని ఈయన తెలిపారు. ఇలా పల్లవి ప్రశాంత్ సహాయం చేశారని చెప్పడంతో
మరోసారి ఈయనపై విమర్శలు వస్తున్నాయి. ఇచ్చిన మాట తప్పడమే కాకుండా ఆ మాటను కప్పిపుచ్చుకోవటం కోసం మరొక డ్రామా ఆడుతున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Star Actress: కాళ్లకు మెట్టెలతో షాక్ ఇచ్చిన బ్యూటీ.. ఈ ట్విస్ట్ ఏంటీ భయ్యా?