Pankaj Lamba – Harshita Brella : లండన్ లోని నార్త్ నార్తాంప్టన్ షైర్ లోని కోర్భాలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. భారతీయ మూలాలున్న ఓ యువతిని అత్యంత దారుణంగా చంపేసిన ఘటనలో నిందితుడి కోసం అక్కడి పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 60 మందికి పైగా డిటెక్టీవ్ లు ఈ కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని అక్కడి పోలీసు అధికారులే వెల్లడించారు.
కోర్భా పట్టణంలో ఇంట్లో ఉండే ఓ ఇద్దరు భారతీయ వ్యక్తులు.. ఓ రోజు పెద్దపెట్టున గొడవ పడుతన్నారు. చాలాసేపటి నుంచి వాగ్వివాదం జరిగుతోంది. సాధారణంగా.. ఇలాంటి సందర్భాల్లో చుట్టుపక్కల వాళ్లు పోలీసులను పిలుస్తారు. కానీ.. గత కొన్నాళ్లుగా ఇరుగుపొరుగు వారికి వీరింట్లో గొడవ చాలా సాధారణమైపోంది. దాంతో ఎవరూ పట్టించుకోలేదు. పైగా..అరుచుకుంటున్న వాళ్లు భారతీయ భాషలో పోట్లాడుకుంటుండడంతో వ్యక్తిగత మనస్పర్థలతో అరుచుకుంటుంటున్నారని భావించారు. కొన్ని గంటల తర్వాత.. ఆ రోజుకు గొడవ అయిపోయింది. కానీ.. తర్వాతి రోజు నుంచి ఆ ఇంటి నుంచి ఎలాంటి మాటాలు వినిపించలేదు. సరికదా.. ఎవరూ కనిపించలేదు. ఏమైందని కనుక్కోగా.. గొడవ పడ్డ యువతి శవంగా కారు డిక్కీలో దొరికింది.
భారత్ కు చెందిన పంకజ్ లంబా, హర్షిత బ్రెల్లా దంపతులు లండన్ లో స్థిరపడ్డారు. చాన్నాళ్లుగా అక్కడే ఉంటున్న వీరి మధ్య గత కొన్నాళ్లుగా.. గొడవలు జరుగుతున్నాయి. దాంతో.. హర్షిత బ్రెల్లా తన భర్త పంకజ్ పై గృహ హింస కేసు పెట్టింది. పోలీసుల కౌన్సిలింగ్ సాగుతోంది. ఈ తరుణంలోనే మరోమారు గొడవ జరగగా.. అప్పటి నుంచి హర్షిత కనిపించకుండా పోయింది. గృహ హింస కేసు నమోదు కావడంతో.. ఆమె సంరక్షణాధికారి ఆమె కోసం ఇంటికి వెళ్లగా, ఎవరూ కనిపించలేదు. దాంతో.. అనుమానించిన పోలీసులకు.. మరుసటి రోజే అనుమానాస్పద తీరిలో కారు డిక్కీలో ఆమె శవమైన కనిపించింది. ఇంటికి దూరంలో లండన్ లోని ఇల్ ఫోర్డ్ ప్రాంతంలోని నిలిపి ఉంచిన కారులో.. హర్షిత బ్రెల్లాను గుర్తించారు.
హర్షిత మృత దేహానికి శవపరీక్షలు నిర్వహించగా.. హత్యగా తేలింది. కావాలని లక్ష్యంగా చేసుకుని హత్య చేశారని వైద్యులు వెల్లడించారు. దాంతో.. ఆమె భర్త పంకజ్ గురించి పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారు. ఆమెను తన నార్తాంప్టన్ షైర్ లోని కోర్భాలో సొంత ఇంట్లో హత్య చేసినట్లు భావిస్తున్న పోలీసులు.. కార్ లో అంత దూరం తరలించినట్లు భావిస్తున్నారు. పైగా.. పంకజ్ పై ఇప్పటికే.. గృహ హింస కేసు సైతం ఉండడం, ఆమె చనిపోయినప్పటి నుంచి పంకజ్ కనిపించకుండా పోవడంతో.. హర్షిత హత్యకు గురైనట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు.
Also Read : పెళ్లిలో అతిథులపై కారు ఎక్కించేసిన వరుడి బంధువు.. టివి రిమోట్ ఇవ్వలేదని హత్య
ఇప్పటికే.. ఘటనా స్థలం నుంచి అన్ని రకాల ఆధారాలు సేకరించిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు.. ప్రధాన నిందితుడు పంజన్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం ఏకంగా 60 మంది డిటెక్టీవ్ లు పనిచేస్తున్నారని, పంకజ్ ఎక్కడ ఉన్నా.. పట్టుకుంటామని అక్కడి పోలీసులు వెల్లడించారు.