Konatham Dileep Arrest: ఏపీలో సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద కామెంట్స్, మహిళల వ్యక్తిగత హాననానికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. సేమ్ టు సేమ్ అదే రీతిలో తెలంగాణలో సైతం పోలీసులు అదే పంథాలో వివాదాస్పద కామెంట్స్ చేస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై చర్యలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే వివాదాస్పద కామెంట్స్ చేస్తూ, రెచ్చగొట్టే ధోరణిలో సోషల్ మీడియాలో పోస్టులు పోస్ట్ చేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టిఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనితో ఏపీలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం తెలంగాణకు పాకిందని ప్రచారం సాగుతోంది.
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ కొణతం దిలీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదులు నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాలతో సిసిఎస్ లో విచారణకు దిలీప్ హాజరయ్యారు. విశాల్ అనంతరం దిలీప్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం ఉస్మానియాకు తరలించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇంచార్జ్ గా గల దిలీప్ అరెస్టు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ కు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా పలు వివాదాస్పద పోస్టులు పోస్ట్ చేశారన్నది ఆరోపణ కాగా, సీసీఎస్ పోలీసులు ఆదిశగా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు సోషల్ మీడియా ద్వారా ఎన్ని అకౌంట్స్ హ్యాండిల్ చేస్తున్నారు? మహిళల వ్యక్తిగత హననానికి దారి తీసేలా పోస్టులు పోస్ట్ చేయడం వెనక కుట్ర ఏదైనా ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు విచారించినట్లు సమాచారం.
Also Read: Lady Aghori: అఘోరీ టార్గెట్ ధర్మ పరిరక్షణ? విధ్వంసమా? వినాశనమా? ఎందుకింత రచ్చ?
గతంలో తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ ట్రోలింగ్స్ వ్యవహారంతో మంత్రి కొండా సురేఖ సీరియస్ కావడం, ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదమై సంచలనంగా మారి, ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతున్నాయి. అందుకే సోషల్ మీడియాలో హద్దులు మీరి పోస్టింగ్స్ చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలంగాణ పోలీసులు తెలుపుతున్నారు. ఎవరైనా రెచ్చగొట్టే ధోరణిలో పోస్టులను పోస్ట్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.