BigTV English

BB 8 Telugu Promo: కన్నడ బ్యాచ్ కి చెమటలు పట్టిస్తున్న ఎక్స్ హౌస్ మేట్స్.. ఇది కదా అసలు గేమ్ అంటే..?

BB 8 Telugu Promo: కన్నడ బ్యాచ్ కి చెమటలు పట్టిస్తున్న ఎక్స్ హౌస్ మేట్స్.. ఇది కదా అసలు గేమ్ అంటే..?

BB 8 Telugu Promo:ప్రస్తుతం బిగ్ బాస్ (Bigg Boss) తెలుగులో 8వ సీజన్ జరుపుకుంటుంది. మరో మూడు వారాలు గడిస్తే సీజన్ కూడా ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే చివరి దశలో ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు ఇస్తూ.. అటు కంటెస్టెంట్స్ కి ఇటు ఆడియన్స్ కి మంచి వినోదాన్ని పంచుతున్నారు బిగ్ బాస్. 11వ వారం ఫ్యామిలీ వీక్ ముగిసింది. కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ ను కలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. అయితే 12వ వారం మొదలయ్యింది .దీనికి తోడు 11వ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్న కంటెస్టెంట్స్ లో నామినేషన్ భయం మొదలయ్యింది. ఎందుకంటే ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేయనున్నారు.


కన్నడ బ్యాచ్ ను నామినేట్ చేసిన సోనియా..

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సాధారణంగా నామినేషన్స్ ప్రక్రియ అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేసేవారు. కానీ ఇప్పుడు.. ఇప్పటివరకు దాదాపు 11 వారాలలో ఎలిమినేట్ అయిన ఎక్స్ హౌస్ మేట్స్ ని హౌస్ లోకి తీసుకువచ్చి వారితో ఇద్దరిని నామినేట్ చేయించడం, ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించలేనిది. ఇక నామినేషన్ మొదలవగానే మొదట సోనియా(Sonia) హౌస్ లోకి అడుగుపెట్టి కన్నడ బ్యాచ్ అంటూ చెప్పుకుంటున్న ప్రేరణ, నిఖిల్ ను నామినేట్ చేసి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు మొదటి వారమే విజిల్ కుక్కర్ పేరుతో అన్యాయంగా ఎలిమినేట్ అయిన బెజవాడ బేబక్క (Bejawada Bebakka)తో పాటు కొడుకు పుట్టాడన్న సంతోషంలో రెండవ వారం స్వయంగా వెళ్ళిపోయిన ఆర్జే శేఖర్ బాషా (RJ Sekhar basha) హౌస్ లోకి వచ్చారు.


కరెక్ట్ రీజన్ చెప్పి కన్నడ బ్యాచ్ ను ఆట ఆడుకున్న బేబక్క..

ఇక వీరిద్దరూ కూడా కన్నడ బ్యాచ్ ని టార్గెట్ చేయడంతో అసలు ఆట ఇప్పుడే మొదలైంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక మొదట బెజవాడ బేబక్క తన నామినేషన్స్ లో భాగంగా.. పృథ్వీ ను నామినేట్ చేసింది. “ఒక మనిషి స్ట్రెంత్ అన్నది.. ఫిజికల్ పైన డిపెండ్ అవుతుందని నేను అనుకోను. ముఖ్యంగా ఎవరిని ఎలా తక్కువ చేసి మాట్లాడాలో మీకు బాగా తెలుసు. మరి మీరు ఫిజికల్ గా స్ట్రెంత్ అనుకున్నప్పుడు ఎందుకు నిఖిల్ తో పోటీ పడలేదు?” అంటూ ప్రశ్నించింది. అలాగే “కుక్కర్ నామినేషన్ తీసుకొచ్చి, సోనియా చెప్పిన మాటలను విని. నీ టీం అయిన నన్ను నువ్వు కాపాడుకోలేకపోయావు “అంటూ నిఖిల్ పై కామెంట్ చేస్తూ నామినేట్ చేసింది.

ప్రేరణ , యష్మీలకు చుక్కలు చూపించిన శేఖర్ భాష..

శేఖర్ భాష (Sekhar basha)మాట్లాడుతూ.. తన నామినేషన్స్ లో భాగంగా ప్రేరణను నామినేట్ చేశాడు. “ప్రేరణ రూడ్ గా బిహేవ్ చేస్తోంది. ఎదుటివారిని కించపరిచేలా మాట్లాడడం, ముఖ్యంగా ఒక పురుగులా చూడడం నచ్చలేదు” అంటూ శేఖర్ భాష తెలిపాడు. “పానిపట్టు టాస్క్ లో నిఖిల్ చాలా రూడ్ గా బిహేవ్ చేశారు. అది మీరు కూడా అనుకున్నారు. ఆ పాయింట్ను పట్టుకొని మీరు నామినేట్ చేయొచ్చు కదా.. కానీ నీ టీమ్ వాడైన గౌతమ్ ను నువ్వు నామినేట్ చేశావు.. ముఖ్యంగా స్ట్రాంగ్ రీసన్ నిఖిల్ మీద ఉన్నప్పుడు నువ్వెందుకు నామినేట్ చేయలేదు..? ఎందుకంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు..” అంటూ అసలు నిజాన్ని బయటపెట్టారు. అలాగే శేఖర్ భాష తన నెక్స్ట్ నామినేషన్ యష్మీ ని వేశారు. అవినాష్ రోహిణిని సేవ్ చేసి నిఖిల్ ని నామినేట్ చేశారు. అయితే అప్పుడు నీకెందుకు బాధ కలిగింది. ఇక నిఖిల్ వచ్చి నిన్ను వాళ్లని నామినేట్ చేయమని చెప్పాడు. సో ఇదంతా ఒక గ్రూప్ గేమ్ అని జనాలు అనుకుంటున్నారు అంటూ యష్మీ ని నామినేట్ చేశారు. మొత్తానికైతే ఎక్స్ హౌస్ మేట్స్ అంతా కూడా కన్నడ బ్యాచ్ ను టార్గెట్ చేస్తూ నామినేషన్ చేస్తుండడంతో.. ఇది కూడా బిగ్ బాస్ ప్లాన్ యేనా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×