 
					Ranga Reddy News: హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో బాటసింగారం పెద్ద వాగులో.. భార్యా భర్తలు గల్లంతయ్యారు. ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వెళుతుండగా ప్రమాదం జరిగింది. బైక్‌పై వాగును దాటుతుండగా వరద ఉదృతికి నీటిలో కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో భార్య కృష్ణవేణి మృతి చెందగా.. భర్తను సురక్షితంగా కాపాడారు స్థానికులు .
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మజీద్‌పూర్-బాటసింగారం గ్రామాల మధ్యలో ఉన్న పెద్దవాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. అయితే బైకుపై వెళ్తున్న ఈ దంపతులు ఇబ్రహీంపట్నం నెర్రపల్లి నుంచి తమ స్వస్థలం భువనగిరి మండలం నందనం గ్రామానికి వెళ్తున్నారు. కృష్ణవేణి తండ్రి రవీందర్ ఈ నెల 25న మృతి చెందడంతో, ఆయన పంచదినకర్మ సందర్భంగా వాడపల్లిలోని కృష్ణానదిలో అస్థికలు కలపడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై వాగు దాటుతుండగా, మోంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటికు కొట్టుకుపోయారు. లోలెవల్ కల్వర్టు వద్ద బైక్ అదుపు తప్పడంతో ఇద్దరూ నీటిలో గల్లంతులయ్యారు.
అక్కడి సమీపంలోని స్థానికులు వెంటనే చర్య తీసుకుని ప్రభాకర్‌ను వాగులో నుంచి బయటకు లాగారు. అయితే కృష్ణవేణి తీవ్రంగా తడిమరుగులో చిక్కుకుని మృతి చెందింది. ఆమె అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారని స్థానికులు తెలిపారు.
మోంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఘటన సహా వరదలకు ఆరుగురు మృతి చెందారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, వాగులు, కాల్వలు దాటేందుకు ప్రయత్నించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు..
Also Read: ఘోర ప్రమాదం.. కుప్ప కూలిన హెలికాఫ్టర్.. సోషల్ మీడియాల్ వీడియోలు వైరల్
అయితే ఘటనా స్థలానికి అధికారులు చేరుకుని అక్కడి ప్రాంతాన్ని పరిశీలించారు. వర్షాలు ఆగడంతో మరిన్ని ప్రమాదాలు జరగకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.