Intinti Ramayanam Today Episode November 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. నువ్వు చేస్తున్న పని కరెక్టే కన్నయ్య నువ్వేం ఫీల్ అవ్వాల్సిన పనిలేదు అని అవని కమల్ తో అంటుంది. ఇక భానుమతి ఇంట్లో వాళ్ళందరికీ ఆవకాయ అన్నం కలిపి గోరుముద్దలు పెడుతుంది. అందరూ చాలా బాగుంది అంటూ లొట్టలేసుకుంటూ తింటారు. చాలా చక్కటి భోజనం పెట్టారు అత్తయ్య చాలా మంచి పని చేశారు చాలా సంతోషంగా ఉన్నాము అని అంటారు పార్వతి. బామ్మ ఇలానే రోజు పెట్టవే చాలా బాగుంది అని కమల్ అంటాడు. ఇలానే రోజు తింటే మోషన్స్ అవుతాయి రా ఎదవ అని భానుమతి అంటుంది. మొత్తానికి కుటుంబం మొత్తం ఒకచోట చేరి చాలా సంతోషంగా ఉంటారు. ఆరాధ్య మన కుటుంబం యొక్క ట్రీ ని నేను మేడం చేయమంటే డ్రా చేసి తాతయ్య ఎలా ఉందో చూడు అని ఇస్తుంది. పల్లవి మాత్రం అవనికి తల్లిదండ్రులు లేరని దారుణంగా అవమానిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..అక్షయ్ చాలా సంతోషంగా ఇంటికి వచ్చి నాకు జాబ్ వచ్చిందని చెప్తాడు.. అందరూ అక్షయ్ కి జాబ్ రావడంతో సంతోషంగా ఉంటారు.. ఏం జాబ్ వచ్చింది అని అడగ్గాని ఫీల్డ్ ఆఫీసర్ జాబ్ వచ్చింది అని అక్షయ్ చెప్తాడు.. ఆ మాట వినగానే శ్రియ అది ఇంటింటికి వెళ్లి బిల్స్ ని కలెక్ట్ చేసుకునే జాబు ఇది ఒక జాబ్ అని వెటకారంగా మాట్లాడుతుంది. మీ ఆయన ఏదో పెద్ద లాయరు సుప్రీంకోర్టు జడ్జ్ అయినట్టు మాట్లాడుతున్నావే అంత పెద్ద లాయర్ ఏంటి ఈపాటికి పాతికమంది ఇంటి దగ్గర క్యూ కట్టే వాళ్ళు కదా అని అంటాడు. చక్రధర్ తన మొదటి భార్య గుర్తుగా చేతి మీద ఉన్న టాటూ ని తన ఫ్రెండ్ చూసి అడగగానే అసలు నిజం చెప్పేస్తాడు.. ఇక మీనాక్షి ఎక్కడుందో అవని ఆలోచిస్తూ ఉంటుంది.
మీనాక్షి తన కొడుకు కూతురు ఎక్కడున్నారో వెతుక్కుంటూ రాజేంద్రప్రసాద్ గతంలో ఉన్న ఇంటికి వచ్చేస్తుంది. అవని ఉంటున్న ఇల్లు ఇదే అనుకుంటాను ఎవరినైనా అడిగి తెలుసుకుందామని మీనాక్షి అంటుంది.. అక్కడున్న ఓ వ్యక్తిని అడిగి ఇది రాజేంద్రప్రసాద్ గారి ఇల్లే అనా అడుగుతుంది.. ఆ వ్యక్తి అవునండి రాజేంద్రప్రసాద్ గారి ఇల్లు కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు నిన్న వేసి ఎక్కడికో వెళ్లిపోయారని అంటారు. ఆ మాట విను గాని మీనాక్షి షాక్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు ఎలా వెతుక్కోవాలి అని మీనాక్షి టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఎదురుగా ఓ వ్యక్తి రావడం చూసిన మీనాక్షి బాబు నా కూతురుతో ఫోన్ మాట్లాడాలి కాస్త ఫోన్ కలుపుతావా నెంబర్ చెప్తాను అని మీనాక్షి అడుగుతుంది.. అయితే ఆ ఫోన్ నెంబర్ చెప్తూ ఉండగా ఫోటో ఎగిరిపోతుంది. అని వెతుక్కుంటూ మీనాక్షి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది.. మీనాక్షి ఫోటో కోసం రోడ్లు పట్టుకుని పరిగెడుతూ ఉంటుంది. కానీ ఆ ఫోటో వెళ్లి అక్కడ ఉన్న చక్రధర్ కారు పై పడుతుంది. చక్రధర్ ని చూసిన మీనాక్షి అక్కడి నుంచి వీడి కంటపడకూడదు అని మెల్లగా వెళ్ళిపోతుంది.. ఆ ఫోటోని చూసినా చక్రధర్ మీనాక్షి మళ్ళీ వచ్చిందా ఈ రౌడీ వెదవ చేసిన పొరపాటికి నాకు మళ్ళీ టెన్షన్ పట్టుకుంది అని ఎలాగైనా సరే మీనాక్షిని పట్టుకోవాలని అనుకుంటాడు..
మీనాక్షి ఇక్కడికి వచ్చిందంటే అవనిని కలిసిందేమో తెలుసుకోవాలని వెంటనే రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్తాడు. చక్రధర్ ని చూసిన పల్లవి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది. నా భర్త బిజినెస్ చేసి బాగుపడతాడు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వను పో నీ సమస్యలు నా దగ్గరికి తీసుకురావద్దు అని అంతగా మాట్లాడావు కదా మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని పల్లవి అడుగుతుంది.. అదేంటమ్మా పల్లవి నిన్ను చూడడానికే వచ్చాను అని చక్రధర్ అంటాడు.
నువ్వు నన్ను కూతురు లాగా చూసావా నీ అల్లుడు బాగుపడతాడు అంటే నువ్వు ఒప్పుకోలేదు. నన్ను దారుణంగా అవమానించావు నీకు నాకు ఏ సంబంధం లేదు అని మాట్లాడావు కదా ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు ఇక్కడికి ఎప్పుడు రావద్దు అని చక్రధర్ తో అంటుంది. వెనకాల ఉన్న అవని పల్లవివెనకాల ఉన్న అవని పల్లవి కన్న తండ్రి తో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియదా.. నేను మంచివాడ చెడ్డవాడ అన్నది పక్కన పెడితే నీ తండ్రి అన్నది నువ్వు మర్చిపోతున్నావు అని పల్లవి పై సీరియస్ అవుతుంది.
Also Read : చేపలు ఎత్తుకెళ్లిన మనోజ్.. తప్పించుకున్న ప్రభావతి.. మనోజ్ పని అవుట్..
నీకు కన్నతండ్రి ఉండి నీ తండ్రి నీకు నాకు ఏ సంబంధం లేదు అని వదిలేస్తే ఆ పెయిన్ ఏంటో నీకు తెలిసుండేది అని పల్లవి అంటుంది. నేను మా డాడీ గురించి కదా మాట్లాడుతున్నాను ఏదో మీ డాడీ గురించి మాట్లాడినట్టు ఫీల్ అయిపోతున్నావు ఏంటి అని పల్లవి అంటుంది. నీకు అయినా నాన్న కావచ్చు నాకు ఆయన బాబాయ్ అంటే నాన్న అవుతాడు అని అవని అంటుంది. మీరు లోపలికి రండి బాబాయ్ గారు అని అవని అనగానే నేను వెళ్లిపోమంటే నువ్వు లోపలికి రమ్మంటావేంటి అని పల్లవి గొడవకు దిగుతుంది. చక్రధర్ ఎందుకు లేమ్మా గొడవ నేను వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..