BigTV English
Advertisement

UP woman: ఎగ‘తాళి’.. పెళ్లైన మూడేళ్లకు భర్తను వదిలి ప్రియుడితో, ఆపై చనిపోయిందంటూ.. యూపీలో

UP woman: ఎగ‘తాళి’.. పెళ్లైన మూడేళ్లకు భర్తను వదిలి ప్రియుడితో, ఆపై చనిపోయిందంటూ.. యూపీలో

UP woman: వారిద్దరు భార్యాభర్తలు.. పెళ్లై మూడేళ్లు అయ్యింది. ఏం జరిగింది.. ఏమైందో ఎవరికీ తెలీదు. ఆ మహిళ కనిపించలేదు. ఆ తర్వాత కేసులు.. కోర్టులు.. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు గుట్టు బయటపడింది. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్నట్లు తేలింది. మరి న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతోందనేది అసలు ప్రశ్న. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలో వెలుగు చూసింది.


ఉత్తర‌ప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల కవితకు 2017, నవంబర్ 17న మ్యారేజ్ అయ్యింది. దడ్వా బజార్‌కు చెందిన విజయ్ కుమార్‌తో పెద్దలు పెళ్లి చేశారు. మూడేళ్ల వరకు ఈ దంపతుల కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలీదు. కరెక్ట్‌గా కరోనా సమయంలో ఆ ఇల్లాలు కనిపించలేదు.

దీంతో కవిత పుట్టింటివారు.. అత్తింటివారిపై ఆరోపణలు గుప్పించడం, ఆపై పోలీసులను ఆశ్రయించడం జరిగింది. చివరకు కేసు సైతం నమోదు అయ్యింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో ఇరు కుటుంబాలు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. న్యాయస్థానం వరకు వెళ్లింది. న్యాయస్థానం ఆదేశాలతో మళ్లీ రంగంలోకి దిగారు పోలీసులు. ఇంతకీ కవిత ఎక్కడ ఉందనేది అసలు ప్రశ్న.


ఎట్టకేలకు కవిత ఆచూకీ కోసం చాలా సమయం పట్టింది. లక్నోకు చెందిన సత్యనారాయణ గుప్తా.. గోండాలోని ఓ మార్కెట్‌లో షాపు నిర్వహిస్తున్నాడు. మ్యారేజ్ తర్వాత ఆయనతో కవితకు ఎప్పుడు పరిచయం ఏర్పడింది. అది వీరిద్దరి మధ్య ప్రేమగా మారింది. ఈ క్రమంలో వివాహ బంధాన్ని ఎగతాళి చేసింది కవిత. ఎవరికీ చెప్పకుండా ప్రియుడితో వెళ్లిపోయిందని పోలీసుల విచారణలో బయటపడింది.

ALSO READ: ఇళ్ల మధ్య భారీ పేలుడు.. ముగ్గురు మృతి..

తొలుత ప్రియుడితో కలిసి అయోధ్యలో కొద్దిరోజులు ఉంది కవిత. ఆ తర్వాత అక్కడి నుంచి లక్నోకు మకాం మార్చారు. చివరకు అన్నికోణాల్లో విచారణ చేసిన పోలీసులు కవితను అరెస్ట్ చేశారు. నేడో రేపో ఆమెని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. మరి న్యాయస్థానం తీర్పు ఏవిధంగా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Related News

Tamilnadu Crime: ఫోటోలు చూసి షాకైన భర్త… మహిళతో ఆ తల్లి ప్రేమ, చిన్నారిని చంపేసి

Ameenpur: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..

Telugu Student Dies in USA: 3 రోజుల క్రితం జలుబు, ఆయాసం.. ఈలోపే అమెరికాలో తెలుగమ్మాయి మృతి..

Gujarat Crime: పెట్రోల్ పంప్ ఓనర్ ఇంట్లో దారుణం.. కూతుళ్లతో కలిసి తండ్రి ఆత్మహత్య, కెనాల్‌లో మృతదేహాలు

Crime News: దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కసాయి కొడుకు..

Konaseema Crime: రామచంద్రాపురం బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ.. దొంగతనానికి వచ్చి చిన్నారి హత్య

Srisailam Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో దగ్దమైన కారు.. స్పాట్‌లో 6గురు

Tirupati Crime: ఆ ఫ్యామిలీలో చిచ్చు.. విసిగిపోయిన ఆ తల్లి, పిల్లలతో కలిసి ఆత్మహత్య

Big Stories

×