Visakhapatnam Crime News: కామాంధులు రెచ్చిపోతున్నారు. తప్పులు చేయవద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోలేదు. లేటెస్ట్‌గా న్యాయ విద్య స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు యువకులు.
ఈ ఘటనపై బాధితురాలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అత్యాచారం సమయంలో బాధితురాలిని నగ్నంగా వీడియోలు తీసి బెదిరించారు.
ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఒకరు బాధితురాలితో రెండు నెలల నుంచి పరిచయం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఘటనపై విచారణ జరుగుతోందన్నారు. పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.